Posted on 2025-10-25 16:10:19
నవీపేట మండలం యంచ గ్రామస్థులను పంట నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు
ప్రభుత్వం చేసిన పాపం కారణంగానే రైతులకు నష్టం జరిగిందని ఆవేదన
ఎకరాకు రూ. 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:గోదావరి పరివాహాక ప్రాంతం నవీపేట మండలంలో గతంలో ఎన్నడు లేనంత నష్టం జరిగిందని,.ఇది దేవుడు చేసిన నష్టం కాదని ఈ సారి ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చేసిన పాపమిది అని అన్నారు. శనివారం జనం బాటలో భాగంగా నవీపేట్, మండలంలోని ఆయా గ్రామాలలో మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
అంతకుముందు మనం వరదలు వచ్చిన తట్టుకునే విధంగా సిద్ధంగా ఉండేవాళ్లం. ఈ ప్రభుత్వానికి ఆ సోయి లేదు. యూరియ కూడా ఇవ్వటానికి సరైన ప్రణాళిక లేదు. యూరియ ఇవ్వటానికి కూడా రైతులను లైన్లలో నిలబెట్టారని ఆమె అన్నారు. యూరియ గురించే తెలియని ప్రభుత్వానికి ఇక నీళ్ల గురించి ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. ఎస్సారెస్పీ నుంచి అవసరాన్ని బట్టి నీళ్లు వదిలితే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని ఆమె అన్నారు. కానీ ఈసారి అలాగే నిల్వ ఉంచారు. మొత్తం గేట్లు ఎత్తకుండా సగమే ఎత్తారు. అంటే రైతులను మోసం చేయటంతోనే ఈ ప్రభుత్వం మొదలుపెట్టిందన్నారు. వరంగల్ లో రైతు డిక్లరేషన్ పేరు చెప్పి ఏమీ చేయలేదు. రెండేళ్లు అనేక విధాలుగా భరించామని ఇకపై భరించే ప్రసక్తే లేదన్నారు.
రెండేళ్లలో ఒకేసారి బోనస్ ఇచ్చారు. ఉషారుతనం అంతా రైతుల దగ్గరనే ప్రదర్శిస్తున్నాని దుయ్యబట్టారు. రైతులు పంట సగం అమ్ముకున్న తర్వాత కాంటాలు పెడుతున్నారు. కొంత పంట మాత్రమే కొని కొందరికే బోనస్ ఇస్తున్నారు. మన కళ్లముందు జరుగుతున్న మోసాలనే తాను చెబుతున్నానని అన్నారు. మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సహా ఖమ్మం మంత్రులు నిజామాబాద్ రైతులను ముంచారని విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీరు తెలంగాణకు మంత్రి అని మరిచిపోవద్దని ఆమె గుర్తు చేశారు. అందరూ రైతుల గురించి ఆలోచించాలి.
నవీపేట మండలంలోని 9 గ్రామాల్లో 5 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. కలెక్టర్ గారు మీ ఎమ్మార్వోలు తప్పుడు లెక్కలు రాశారని ఆరోపించారు.
మళ్లీ అధికారులను పంపించి నీతిగా నిజాయితీగా లెక్కలు రాయించండన్నారు. కేసీఆర్ హయాంలో మనం అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్లను 9 వేల మందిని పెట్టుకున్నాం అని వారంతా సరైన లెక్కలు రాసి కలెక్టర్ కు నివేదిక ఇవ్వాలని కోరారు. పది రోజుల పాటు పంట మునగటంతో రైతులు పుట్టెడు శోకంలో ఉన్నారన్నారు. వారికి ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. జిల్లా కలెక్టర్ నవీపేట్ మీరే స్వయంగా వచ్చి పరిశీలించాలని కోరారు.
నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 50 వేలు ఇవ్వాలని సీఎంను, వ్యవసాయ మంత్రిని డిమాండ్ చేశారు. ఈ జిల్లా మాజీమంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రైతుల సమస్యపై దయచేసి శ్రద్ధ పెట్టాలన్నారు. బోధన్ రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మక్క ఇప్పటికే వచ్చి ఉన్నది. ఇంత వరకు పట్టించుకోవటం లేదన్నారు. పసుపు పంటకు మద్దతు ధర ఇస్తామని చెప్పి పట్టించుకోవటం లేదని మండిపడ్డారు.సోయ రైతుల పంటను కూడా కొనుగోలు చేయలేదని, రైతులకు సంబంధించి ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని కోరారు. మహిళలకు రూ. 2500, తులం బంగారం ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఆ ఊసే ఎత్తటం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలి అని ఎద్దేవా చేశారు. ఆయన తులం బంగారం ఇస్తా అన్న తర్వాత రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ధరలు ఆకాశానికి అంటకముందే తులం బంగారం ఇవ్వాలని, బీడీల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ ను 4 వేలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కాంగ్రెస్ పార్టీ అబద్దాలను ఏమని చెప్పాలన్నారు బతుకమ్మ చీరలు రెండు ఇస్తామన్నారు. బతుకమ్మ పండుగకు అవి ఇవ్వడంలో కూడా రాష్ట్ర సర్కార్ విఫలమైందన్నారు. కానీ తెలంగాణ తల్లి చేతుల నుంచే బతుకమ్మను తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలవటానికి బొంకిండు తప్ప... రేవంత్ రెడ్డికి తెలంగాణ మీద, బతుకమ్మ మీద ప్రేమ లేదని ఆక్షేపించారు. పిడికిలెత్తి పోరాటం చేస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. ఇక్కడి రైతుల సమస్యను ఇంతటితో వదిలి పెట్టనని, సీఎం, వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఆదివారం నిజామాబాద్ లోనే ఉంటానని,అవసరమైతే రైతులతో కలిసి కలెక్టర్ ను కలిసి రైతులు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు.
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >