Posted on 2025-10-25 10:03:03
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం 21 అక్టోబర్ 2025 (పోలీసు ఫ్లాగ్ డే) ను పురస్కరిoచుకొని తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో" సైకిల్ /బైక్ ర్యాలీ" కార్యక్రమాన్ని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్., ఆధ్వర్యంలో నిర్వహించారు.
సైకిల్, బైక్ ర్యాలీ ఉదయం 9:30 గంటలకు పూలాంగ్ చౌరస్తా నుండి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ప్రారంభించారు. పూలాంగ్ చౌరస్తా నుండి ప్రారంభమై దేవి రోడ్డు చౌరస్తా- కోర్టు చౌరస్తా - గ్లామర్ హోటల్ చౌరస్తా - చెన్నైయ్ షాపింగ్ మాల్ చౌరస్తా- ఆర్.టి.సి బస్టాండ్ - ప్రభుత్వ హాస్పటల్- దేవిరోడ్డు చౌరస్తా -గాంధీ చౌక్ చౌరస్తా - నెహ్రూ పార్కు చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎందరో పోలీస్ సిబ్బంది ప్రగతి అంతర్గత భద్రత కాపాడటానికి నక్సలైట్లు, మతపరమైన విభజన శక్తులు, ఇతర సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోంటూ నేరాల అరికట్టడం, మాదక ద్రవ్యాల అణచివేయడానికి, మహిళ భద్రతకు ,తమ ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. వీరి త్యాగాల వల్లనే ఈ రోజు దేశం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ కమిషనరేటు లో ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఈ నేల చెరగని ముద్ర వేసిందని అన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చూడాలని, ఎక్కడ ఎలాంటి సంఘటన చోటు చేసుకున్న, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ మేరకు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల భాగంగా పోలీసు కుటుంబాలను పరమర్శించినట్లు తెలిపారు. మన పోలీసులు ఒకటే కుటుంబం వారు వేసుకున్న యూనిఫాం అందరికీ గర్వకారణమని వారి త్యాగాల వల్ల నేడు మనం గర్వంగా బతుకుతున్నామని కొనియాడారు. ఈ దేశం కోసం న్యాయం కోసం ,ఎప్పటికీ తలవంచకుండా. పక్షపాతం లేకుండా, సేవా చేయడానికి మన హృదయలతో ప్రమాణం చేద్దామని పేర్కొన్నారు. అదే విధంగా ఈనెల 29 న రక్తదాన శిబిరం ఏర్పాటుచేస్తామని ఇందులో ప్రతీ ఒక్కరు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యాక్రమంలో అదనపు డి.సి.పి (అడ్మిన్ ) బస్వారెడ్డి, అదనపు డి.సి.పి ( ఎ.ఆర్ ) రామ్ చందర్ రావ్, నిజామాబాద్, ట్రాఫిక్ ఎ.సి.పిలు రాజా వెంకట్ రెడ్డి, మస్తాన్ అలీ, సి.ఐలు, రిజర్వు ఇన్స్ పెక్టర్లు, ఎస్.ఐలు, ఆర్.ఎస్.ఐలు, ఆర్మూడ్ రిజర్వు సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది . ఎన్.సి.పి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >