| Daily భారత్
Logo




“క్షమాపణ” చెప్పి బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన కవిత!

News

Posted on 2025-10-25 10:17:16

Share: Share


“క్షమాపణ” చెప్పి బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన కవిత!

డైలీ భారత్, హైదరాబాద్: కల్వకుంట్ల కవిత తన జాగృతి తరపున జనంబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా తెలంగాణ వీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు బీఆర్ఎస్ తరపున క్షమాపణలు చెప్పారు. 10 సంవత్సరాల పాలనలో వీరులకు, వారి కుటుంబాలకు సరైన గౌరవం, మద్దతు అందించలేకపోయామని ఒప్పుకున్నారు.

అసెంబ్లీలో 1,200 మంది అమరవీరులను ప్రకటించామని, కానీ కేవలం 580 కుటుంబాలకు మాత్రమే రూ.10 లక్షలు , ఉద్యోగాలు ఇవ్వగలిగామన్నారు. ప్రభుత్వం గుర్తించిన మొత్తం 1,200 కుటుంబాలకు రూ. 1 కోటి సహాయం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంలో పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. కవిత ప్రకటన బీఆర్ఎస్ పార్టీని ఉలిక్కిపడేలా చేసింది. తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారందరినీ తాము గౌరవించామని బీఆర్ఎస్ పార్టీ ఇంత కాలం చెబుతూ వస్తోంది.

కానీ ఇప్పుడు స్వయంగా కవితనే తాము ఏమీ చేయలేదని చెప్పడం.. తాను రూ. కోటి సాయం అందించేందుకు పోరాడతానని చెప్పడం ఆ పార్టీని విస్మయానికి గురి చేస్తోంది. కవిత ఇప్పుడు బీఆర్ఎస్ లో లేరు..కానీ ఆమె ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ కుమార్తె. ఆమెనే ఇలా ప్రకటిస్తే ఇక బీఆర్ఎస్ పార్టీ ఇజ్జత్ ఎలా ఉంటుంది ?. కవిత ప్రారంభం చూస్తే.. బీఆర్ఎస్ దగ్గర ఏ మూల అయినా తెలంగాణ వాదం అనే బలం మిగిలి ఉంటే… అది తన సొంతం కావాలన్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ టార్గెట్ గానే ఆమె రాజకీయాలు జరుగుతున్నాయని అనుకోవచ్చు.

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >