| Daily భారత్
Logo




ఆర్థిక ఇబ్బందులతో అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య

News

Posted on 2025-10-25 10:33:45

Share: Share


ఆర్థిక ఇబ్బందులతో అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య

డైలీ భారత్, చందుర్తి: చందుర్తి మండలంలోని సనుగుల గ్రామానికి చెందిన గొట్టే పరిమిళ ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. గొట్టే పరిమళ(39) దేవుని తండా గ్రామంలో గత 23 సంవత్సరాలుగా అంగన్వాడి ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తుందని తెలిపారు. తనకు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉండేవని, ఆరోగ్య సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న సమయంలో, ఇలా చేసుకోవడం చాలా బాధాకరంగా ఉన్నదని తన సహచరులు, స్థానికులు తెలిపారు. అలాగే తనకి ఇద్దరు కుమారులు. మొదటి కొడుకు శరత్ కుమార్‌కు 20 సంవత్సరాలు కాగా రెండవ కొడుకు శుసంక్‌కు 14 సంవత్సరాలు. పరిమళ భర్త నరేష్ ఆర్టీసీలో ప్రైవేటు డ్రైవర్‌గా పని చేస్తుండడంతో రోజులాగే ఈరోజు కూడా ఉదయం 6గంటల సమయంలో ఇంట్లో నుండి వెళ్ళాడని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని చెబుతున్నారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక పరిమళ ఆత్మహత్య కుటుంబంలో తీరని బాధను మిగిల్చి వెళ్లిపోయిందని స్థానికులు చెబుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది 

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >