| Daily భారత్
Logo




హలో "తెలంగాణ బిసి"చలో "రాజ్ భవన్"ముట్టడినీ ఖండించిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్

News

Posted on 2025-10-23 21:54:14

Share: Share


హలో "తెలంగాణ బిసి"చలో "రాజ్ భవన్"ముట్టడినీ ఖండించిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్

అక్రమ అరెస్టులతో "బీసీ"ల ఉద్యమాన్ని ఆపలేరు...! 

తెలంగాణలో "బీసీ"ల హక్కుల కోసం నిరంతరం పోరాటం...!

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్...

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెంజిల్లాతెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పొన్నం ఉపేందర్ నాయుడు పాల్గొనితెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ ఆమోదించాలనే డిమాండ్‌తో "రాజ్ భవన్" ముట్టడి కార్యక్రమం గురువారం నిర్వహించగా, సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.బీసీల హక్కుల కోసం జరుగుతున్న ఈ ఉద్యమాన్ని అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మేకపోతుల నరేందర్ గౌడ్  తీవ్రంగా ఖండించారు.అధ్యక్షులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ వద్ద 42% బీసీ రిజర్వేషన్ బిల్లును నెలల తరబడి పెండింగ్‌లో ఉంచడం సర్వథా అన్యాయం. సుప్రీంకోర్టు స్పష్టంగా మూడు నెలలకు మించి బిల్లులను గవర్నర్ వద్ద నిలిపివేయొద్దని పేర్కొంది. అయినా కూడా తెలంగాణ బీసీలకు సంబంధించిన కీలక  బిల్లును ఎందుకు ఆమోదించడంలేదు అని ప్రశ్నించారు.తెలంగాణలో బీసీలు జనాభాలో 60% పైగా ఉన్నప్పటికీ, అధికారంలో, ఉద్యోగాల్లో, విద్యలో తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆయన తెలిపారు. అందుకే 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం న్యాయం మాత్రమే కాదు, సామాజిక సమతుల్యతకు అవసరము ఎంతైనాఉందనిఅన్నారు.అక్రమఅరెస్టులు, అణచివేతలతో ఉద్యమాన్ని ఆపలేరు.తెలంగాణ రాష్ట్రంలో బీసీల న్యాయమైన హక్కులకోసం మాపోరాటం రాష్ట్ర వ్యాప్తంగా మరింత వేగంగా కొన సాగుతుందనిమేకపోతుల నరేంద రగౌడ్ హెచ్చరించారు.తద్వారా గవర్నర్  వెంటనే బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించి, తెలంగాణ రాష్ట్ర  బీసీలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి పటేల్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మహిళ అధ్యక్షురాలు సౌజన్య గౌడ్, తెలంగాణ బిసి సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు మట్టా రాజు యాదవ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిగాని బిక్షపతి గౌడ్, తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర శ్రీహరి గౌడ్, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెంట అజయ్ పటేల్,  తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర సలహాదారుడు దేశగాని నాగరాజు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కాడబోయిన మల్లేష్ యాదవ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులుయువజన కొత్త వినయ్ బాబు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సరిత,తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ కాల్వ మధుబాబు, తెలంగాణ బిసి సంక్షేమ సంఘం  జగిత్యాల జిల్లా అధ్యక్షులు యాగండ్ల రమేష్ గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బత్తుల మహేందర్ యాదవ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పులాగరి అంబదాస్, తెలంగాణ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పురెళ్ల శ్రవణ్ పటేల్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  చర్లపల్లి సురేష్ గౌడ్,  తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వేములవాడ నియోజకవర్గ అధ్యక్షులు మొగిలి కరుణాకర్, మల్లేష్ యాదవ్, తెలంగాణ బీసీ మానకొండూరు మండల అధ్యక్షులు ముఖ్యర సతీష్, చత్రపతి సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు దొమ్మాటి.శివకుమార్, పొడిశెట్టి.వెంకన్న గౌడ్, అయితే రాజు రజక,తదితరులు పాల్గొన్నారు.

Image 1

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్..

Posted On 2026-05-12 11:14:01

Readmore >
Image 1

బీటెక్ విద్యార్థి "యవన్" దారుణ హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు : 10 మంది నిందితుల అరెస్ట్

Posted On 2026-05-12 06:24:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచ్ భర్త

Posted On 2026-05-11 21:14:13

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు

Posted On 2026-05-11 21:12:14

Readmore >
Image 1

నకిలీ నంబర్ ప్లేట్ వినియోగించిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు

Posted On 2026-05-11 21:02:02

Readmore >
Image 1

తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా గద్వాల్ విజయలక్ష్మి

Posted On 2026-05-11 20:55:26

Readmore >
Image 1

మతసామరస్యాన్ని కాపాడేలా పండుగల నిర్వహణ చేపట్టాలి : డిఎస్పీ నాగేంద్రచారి

Posted On 2026-05-11 20:42:59

Readmore >
Image 1

రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్

Posted On 2026-05-11 20:38:54

Readmore >
Image 1

ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలి : ఏబీవీపీ

Posted On 2026-05-11 20:36:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణి లో 111 దరఖాస్తులు

Posted On 2026-05-11 20:35:56

Readmore >