Posted on 2025-10-18 21:03:42
విధినిర్వహణలో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ ను హత్య చేసి పరార్ అవుతున్న వీడియోలు ఫోటోలు తీస్తూ కనీసం కానిస్టేబుల్ ప్రాణాలు కాపాడాలని ధ్యాస లేని సిగ్గులేని సమాజం
కానిస్టేబుల్ హత్య ఉదంతంతో ఉలిక్కిపడుతున్న జిల్లా ప్రజలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మారదు లోకం.. మారదు సమాజం.. ఈ సిగ్గులేని సమాజం అని ఒక సినీ గేయ రచయిత ఓ సినిమాలో పాడిన పాటకు అక్షరాల నిజం చేసి చూపారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు. ఒక క్రిమినల్ పాత నేరస్తుడుని పట్టుకొని స్టేషన్లో అప్పజెప్పడానికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో సిసిఎస్ కానిస్టేబుల్ అయిన ప్రమోద్ ను అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేసి నిర్భయంగా పరారవుతున్న అక్కడే ఉన్న స్థానికులు ఫోటోలు వీడియోలు తీస్తూ కాలక్షేపం చేశారే తప్ప ఒక మనిషి చావు బతుకులో ఉన్నారు వారిని కాపాడాలని ఇంగిత జ్ఞానం కూడా లేని వారు ఒక్క క్షణం ఆలోచించి వారు మొబైల్ లో తీస్తున్న వీడియోలు ఫోటోలను ఆపి కానిస్టేబుల్ పై దాడి చేసి హత్యకు పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకోకుండా సినిమా చూసినట్లు చూశారే తప్ప ఏమీ చేయలేకపోయారు. ఫలితంగా విధుల్లో ఉన్నావు కానిస్టేబుల్ దీపావళి పండగ ముందు వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అందుకే నిజామాబాద్ సిపి సాయి చైతన్య శనివారం ఉదయం జిల్లా ప్రజల్లో మానవత్వం ఏమాత్రం లేదని వ్యాఖ్యానించారు అందులో ఏమాత్రం తప్పులేదు. ఒకవేళ అదే ప్రాంతంలో ఎవరో ఒక రౌడీ ఒక ఇంటిపై డాడీ చేసి ఇంట్లో ఉన్న వారిని గాయాలపాలు చేసి హత్య చేస్తే ఇలానే నిర్లక్ష్యంగా ఊరుకుంటారా అని మనలో మనమే ఒకసారి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే ఏముంది ఆ కుటుంబానికి పండగ ముందు ఆ కిరాతక నరహంతకుడు చేసిన గాయం జీవితాంతం మర్చిపోలేని పరిస్థితి. ఇప్పటికైనా సమాజంలో ప్రతి ఒక్కరూ మారాలి, మనము మంచి ఉంటే సరిపోతుంది ఎదుటివారు ఏమవుతే మనకి ఏమైతుంది అనే ఆలోచించే వారికి రేపటి నాడు తమ కుటుంబం పైనే ఎవరో ఒకరు దాడి చేస్తే చూస్తూ ఊరుకుంటారా వారిని రక్షించాల్సింది పోలీసులు కాదా.. అనే కనీస ఇంగిత జ్ఞానం తెలియకుండా ప్రవర్తించారు. కానిస్టేబుల్ పై దాడి జరిగిన సమయంలో అక్కడ ఉన్నవారు.
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >
నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ
Posted On 2026-07-03 18:28:35
Readmore >
10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...
Posted On 2026-07-03 09:50:18
Readmore >
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >