| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శ్రీరామ్ మహిపాల్ చారి ఎన్నిక

అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శ్రీరామ్ మహిపాల్ చారి ఎన్నిక

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేశ్వర్ మండలం గంగాసముందర్ గ్రామానికి చెందిన శ్రీరామ్ మహిపాల్ చారి  నియామకం జరిగింది.  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కౌలే జగన్నాథం చేతుల మీదుగా హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో నియామక పత్రం అందజేశారు. అఖిలభారత విశ్వకర్మ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండోజు గంగాధర్ చారి, ప్రధాన కార్యదర్శి సంకోజు లింగాచారి, మహిళ గౌరవ అధ్యక్షురాలు సావిత్రి పట్నాల వారి సమక్షంలో నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామ్ మహిపాల్ చారి మాట్లాడుతూ విశ్వకర్మల కోసం స్వర్ణకారుల సమస్యలపై అనునిత్యం పోరాడుతానని అలాగే ప్రతినిత్యం విశ్వకర్మలకు అందుబాటులో ఉంటానని, బీసీ రిజర్వేషన్ల సాధనకై విశ్వకర్మలు అందరూ ఐక్యమత్యంతో ఉండి రిజర్వేషన్లు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. స్వర్ణకారుల సమస్యలపై దృష్టి సారించి పోరాటం చేస్తానని తెలిపారు.  జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి  రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు కౌలేజగన్నాథం రాష్ట్ర కమిటీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

Previous కానిస్టేబుల్ ప్రమోద్ మృతి దిగ్బ్రాంతికి గురి చేసింది : జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి
Next 1500 వందల సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులపై సంతకాలు చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
ADVERTISEMENT