Posted on 2025-10-17 17:58:53
రైతు ప్రయోజనాలే కూటమి ప్రభుత్వానికి ప్రాధాన్యం
రబీ సీజన్ లో సబ్సీడీపై శనగ విత్తనాలు అందచేసేందుకు చర్యలు తీసుకుంటాం
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
డైలీ భారత్, అమరావతి: రబీ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా శనగ పంట సాగు చేసే రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా రైతుల పట్ల కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతు అభ్యున్నతే మా లక్ష్యం. ప్రతి రైతు అవసరాలను గుర్తించి, వారికి అవసరమైన విత్తనాలు సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు వ్యవసాయ శాఖ ఇప్పటికే జిల్లాల వారీగా అంచనా వేస్తోందని, ప్రతి రైతు అవసరాలకు సరిపడే విత్తనాలు అందుబాటులో ఉండేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. రైతు కష్టపడి పండించే ప్రతి గింజ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమవుతుంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని అన్నారు. రైతు కోసం కొత్త ఆలోచనలు, సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయం లాభదాయకంగా మారాలనే ఉద్దేశ్యంతో సీఎం చంద్రబాబు ప్రత్యేక దిశానిర్దేశాలు ఇచ్చారు. రైతు ఆదాయాన్ని పెంచే ప్రతి కార్యక్రమానికి ప్రభుత్వం అండగా ఉంటుంది అని మంత్రి పేర్కొన్నారు.
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:41:00
Readmore >
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >