| Daily భారత్
Logo




భార్య‌ను చంపిన భ‌ర్త‌

News

Posted on 2025-10-15 08:06:10

Share: Share


భార్య‌ను చంపిన భ‌ర్త‌

డైలీ భారత్, ఆర్మూరు:క‌ట్టుకున్న భార్యను భ‌ర్త‌ అతి దారుణంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న‌ ఆర్మూర్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. బాప‌ట్ల‌కు చెందిన వడ్ల జగదీష్, మమత (35) దంపతులు. గ‌త కొంత కాలంగా వీరు ఆర్మూర్ లోని వేంక‌టేశ్వ‌ర‌కాల‌నీలో నివాసముంటున్నారు. వీరికి ఇద్ద‌రూ పిల్ల‌లు. జ‌గ‌దీశ్ ప‌ట్ట‌ణంలోని చెక్క మిల్లులో వర్కర్ గా పని చేస్తున్నాడు. కొంత కాలంగా జగదీష్ తన భార్య మమతపై అనుమానం పెంచుకున్నాడు. తన భార్య తన కళ్లు గప్పి వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం పెంచుకున్న జగదీష్ భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. తన భార్య మమతపై జగదీష్ అనుమానపు వేధింపులు తీవ్రం కావడంతో వీరి సంసారంలో ప్రశాంతత కరువైనట్లు తెలుస్తోంది. ఇవాళ మ‌ధ్యాహ్నం పని చేసే సా మిల్ నుంచి లంచ్ చేసేందుకు ఇంటికి వ‌చ్చిన‌ జగదీష్ భార్యతో మళ్లీ గొడవ ప‌డ్డాడు. ఇద్దరి మధ్యా మాటామాటా పెరగడంతో కోపంతో విచక్షణ కోల్పోయిన జగదీష్ కత్తితో తన భార్య మెడను అతి కిరాతకంగా నరికాడు. దీంతో మ‌మ‌త అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. అనంతరం జ‌గ‌దీశ్ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద‌కు వెళ్లి తాను నేరం చేశాన‌ని ఒప్పుకున్న‌ట్టు స‌మాచారం.

Image 1

ఏసీబీ వలలో ఇరిగేషన్ అధికారి

Posted On 2026-06-29 23:17:29

Readmore >
Image 1

చలో ఐ అండ్ పి ఆర్ అడ్డుకున్న పోలీసులు

Posted On 2026-06-29 20:35:41

Readmore >
Image 1

లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

Posted On 2026-06-29 18:52:51

Readmore >
Image 1

శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-29 18:51:47

Readmore >
Image 1

ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-06-29 18:50:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు

Posted On 2026-06-29 18:49:45

Readmore >
Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >