డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: భీంగల్ మండలం రహత్ నగర్లో మంగళవారం కృష్ణవేణి స్కూల్ బస్సు కిందపడి శ్రీకాంత్ (3) అనే పసి బాలుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం.. ఉదయం పాఠశాలకు అతని అన్నను బస్సులో ఎక్కించడానికి కుటుంబీకులతో వెళ్లిన సమయంలో బస్సు చక్రాల కింద పడ్డాడు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలుడు కోమాలోకి వెళ్లడంతో వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News
స్కూల్ బస్సు కిందపడి పసి బాలుడి మృతి