Posted on 2025-10-13 13:02:18
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం తానా కలం గ్రామానికి చెందిన ఇంగోలి శిరీష తనకు జరుగుతున్న అన్యాయాన్ని సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. కానాకాలం గ్రామంలో ప్రీ ప్రైమరీ పాఠశాలలో ఇన్స్ట్రక్టర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నానని, అందుకు అన్ని అర్హతలు ఉన్నాయని కలెక్టర్ దృష్టికి వెళ్ళాకే మొదటి విడత ప్రకటించారని ఆ జాబితాలో తన పేరు అన్ని అర్హతలు ఉన్నాయని ఇంగోలి శిరీష తెలిపారు. అయితే విద్యాశాఖ రెండో జాబితా ప్రకటించాక ఆ జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్థాపానికి గురై ఎడపల్లి ఎంఈఓ ను కలవగా ఇదంతా తనకేమీ తెలువదని మొత్తం జిల్లా విద్యాశాఖ అధికారికి తెలుసని ఏదైనా ఉంటే ఆయన దగ్గరికి వెళ్లి సంప్రదించవచ్చని చెప్పారని ఆమె వెల్లడించారు. రెండో జాబితాలో తన పేరు లేకపోవడంలో కచ్చితంగా జిల్లా విద్యాశాఖ మండల విద్యాశాఖ అధికారుల అవినీతి వల్లే రెండో జాబితాలో తన పేరును తొలగించి మరొక వ్యక్తి పేరును చేర్చడం జరిగిందని ఈ పూర్తిగా తనకు అన్యాయం జరిగిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. జీవో ప్రకారం ఎక్స్పీరియన్స్ అని అందులో లేదు కానీ ఆ వ్యక్తిని ఎక్స్పీరియన్స్ ఉందని తీసుకున్నామని డిఇఓ చెప్తున్నారని దీనిపై కలెక్టర్ తగిన విచారణ చేసి తనకు వచ్చిన ఉద్యోగాన్ని తనకు ఇప్పించాలని ఆమె వేడుకున్నారు దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే జిల్లా విద్యాశాఖ అధికారుల పై కోర్టు వరకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె అన్నారు.
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >