| Daily భారత్
Logo




నిజామాబాద్ కాంగ్రెస్ ఎవరు..?

News

Posted on 2025-10-11 19:56:07

Share: Share


నిజామాబాద్ కాంగ్రెస్ ఎవరు..?

పార్టీ విధేయులకా.. లేదా యువతరానికి బాధ్యతలు అప్పజెప్పనున్నారా..?

టెన్షన్ లో జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: స్థానిక సంస్థలు ఎన్నికలు, ఆ తర్వాత నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పగ్గాలు ఎవరికి అధిష్టానం ఇవ్వనున్నారో జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ఓ టెన్షన్ వాతావరణం నెలకొంది. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ జెండా మోస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అహర్నిశలు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేతలకు డిసిసి బాధ్యతలు పార్టీ అధిష్టానం అప్పజెప్పనున్నారా.. లేదా యువతరానికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పనున్నారా అనే ప్రశ్నలు ఆ పార్టీ శ్రేణుల్లో ఒకింత  టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే పార్టీ సీనియర్ నేతల్లో చురుగ్గా పాల్గొంటూ అధికారంలో ఉన్న లేకున్నా పార్టీ అధిష్టానం ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తున్న నరాల రత్నాకర్ పేరు తెరపై వస్తుంది. మరోవైపు యువతరంలో గడుగు గంగాధర్ తనయుడు గడుగు రోహిత్ కు పార్టీ పగ్గాలు అప్పజెప్పనున్నారా, లేదా బొబ్బిలి రామకృష్ణ కు అప్పజెప్పను ఉన్నారా అనేది కొన్ని రోజులు ఆగాల్సిందే.

పార్టీ సంస్థాగత నిర్మాణ పటిష్టత కోసం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఆశవాహుల నుంచి ఈ నెల 12 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. జిల్లా పరిశీలకుడిగా కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే రిజ్వన్ను నియమించారు. అయితే ఏడేళ్లుగా మానాల మోహన్ రెడ్డి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 15 రోజుల్లో జిల్లాకు కొత్త అధ్యక్షున్ని నియమించే అవకాశం ఉంది.

Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >
Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >
Image 1

పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకా వేయించాలి : మంత్రి దామోదర

Posted On 2026-06-27 07:11:39

Readmore >
Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >