| Daily భారత్
Logo




42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తాం

News

Posted on 2025-10-11 15:59:13

Share: Share


42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తాం

అవసరమైతే సుప్రీం కోర్టులో అప్పీలు చేస్తాం..

జిల్లా అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది

పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: 42 శాతం రిజర్వేషన్ వచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి కాంగ్రెస్ పార్టీ వెళుతుందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఇందుకోసం అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి అక్కడ కూడా 42% రిజర్వేషన్ కావాలని అప్పీల్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా ముందుకు వెళ్తామని ఆయన అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  బీజేపీ, బీఆర్ఎస్ కలిసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర చేస్తున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. శనివారం నగరంలోని ఆర్అండ్ బీ అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కట్టుబడి ఉన్నామని అమలు చేస్తామన్నారు. హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లి అప్పీల్ చేసే యోచనలో ఉన్నామన్నారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడంలో ప్రధాన ముద్దాయి బీజేపీయే అని ఆరోపించారు. బనకచర్ల, బీసీ రిజర్వేషన్లపై బీజేపీ - బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నాయని పేర్కొన్నారు. బనక చర్ల విషయంలో మంత్రి హరీష్ రావు మురికిని కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బనక చర్ల జీవోలు వెలువడ్డాయని పేర్కొన్నారు. ఆంధ్రా హక్కులను కాపాడతానన్నది కేసీఆర్ కదా అని ప్రశ్నించారు. జగన్తో కేసీఆర్ చెట్టాపట్టాలు వేసుకుని విందులు, వినోదాలు చేసుకున్నారని, ప్రజల హక్కుల విషయంలో మాత్రం మౌనం వహించారని మండిపడ్డారు. బనక చర్ల పై మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో వివరించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. కుల సర్వే చారిత్రాత్మక నిర్ణయమని పారదర్శకంగా నిర్వహించామన్నారు. మూడు చట్టాలు, ఒక ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ లు బీసీల నోటి కాడ ముద్దను లాగే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. హైదరాబాద్ నుంచి ముంబై వయా నిజామాబాద్ రైల్వే లైన్ తో విషయమై సీఎం చర్చించానని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా కృషి చేస్తానని తెలిపారు. కామారెడ్డి బీసీ సభ తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >
Image 1

పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకా వేయించాలి : మంత్రి దామోదర

Posted On 2026-06-27 07:11:39

Readmore >
Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >