| Daily భారత్
Logo




సైబర్ నేరాల మీద రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా జిల్లాలో ఓ వ్యక్తిపై పి.డి కేసు నమోదు

News

Posted on 2025-10-11 15:57:52

Share: Share


సైబర్ నేరాల మీద రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా జిల్లాలో ఓ వ్యక్తిపై పి.డి కేసు నమోదు

జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవు

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య వెల్లడి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తరుచు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ, దొంగతనాలకు పాల్పడుతూ, ప్రజలలో తరచు భయాందోళలను కలిగించే వారిపై సాధారణంగా చట్ట ప్రకారం చర్యతీసికోవడం జరుగుతుంది. వారు మరోకసారి అటువంటి నేర ప్రవృత్తికి పాల్పడకుండా కేసులు వేసి కోర్టుల ద్వారా శిక్షించడం జరుగుతుంది. అయినప్పటికీ కొంత మంది తమ ప్రవృత్తిని మార్చుకోకుండా తిరిగి అదే తరహ నేరాలకు పాల్పడుతూ సమాజానికి ఒక చీడపురుగులా మారతారు. ఇటువంటి నేరస్థులు భయట ఉంటే సమాజానికి నష్టం జరుగుతుంది. అందుకే వీరిని కొంతకాలం పాటు బయటకి రాకుండా నిరోధించడానికి  ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాన్ని ఉపయోగించడం జరుగుతుందన్నారు. ఈ చట్టం క్రింద గత తరచు నేరాలకు పాల్పడే వారిని నిర్ణీత సంఖ్యలో నేరాలు చేసి సమాజానికి ప్రమాదకరంగా పరిణమించిన వారిపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి రిపోర్టు మేరకు పోలీస్ కమీషనర్ ప్రివెంటివ్ డిటెన్షన్ ఉత్తర్వుల ను జారీచేస్తారు.ఈ ప్రక్రియలో భాగంగా తరుచు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తు,దొంగతనాలకు పాల్పడుతు ప్రజలలో తరుచు బయాందోళనకు కలిగిస్తున్న వారు కానీ, ఈ మద్య కాలంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని కొంత మంది నిరుద్యోగ యువతకు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తాము అని నమ్మబలికి లావోస్, థాయిలాండ్ దేశాలకు పంపించి అక్కడ సైబర్ నేరాలకు పాల్పడేలా బలవంతం చేస్తున్న వ్యక్తిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల సమాచారం ప్రకారం సైబర్ నేరాలు చేయిస్తున్న నిందితుడు యువతకు మంచి ఉద్యోగాలు, అధిక వేతనాలు ఇస్తామని చెప్పి వారిని లావోస్, థాయిలాండ్ దేశాలకు పంపించేవాడు. అక్కడకు వెళ్లిన తర్వాత వారి పాస్పోర్టులు స్వాధీనం చేసుకుని చట్ట విరుద్దమైన సైబర్ మోసాలకు బలవంతంగా పని చేయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కోలనాటి నాగశివ తండ్రి పేరు సత్యనారాయణ రాజు కోలనాటి, వయస్సు 36 సం||,ప్రస్తుతం ఇంటి నెంబర్ 6-264/3/4/6/ఎ, వెంకటేశ్వరకాలనీ, సుచిత్ర, జీడిమెట్ల, తెలంగాణ, ఇతనిపై పలువురు బాధితుల నుంచి ఫిర్యాదులు రాగా 4  కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ గ్యాంగ్ అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని, *ఇందుకు గాను ప్రధాన సూత్ర దారుడైన కోలనాటి నాగశివ పై అక్టోబర్13న పి.డి యాక్ట్ -1986 తెలంగాణ ( ప్రివెన్షన్ డిటెన్షన్ ) ను ప్రయోగించి  అతనిని చెంచల్ గూడా జైలుకు తరలించడం జరిగిందని తెలిపారు. అదే విధంగా నిజామాబాద్ జిల్లా నుండి జారీ చేసిన ప్రివెన్షన్ డిటెన్షన్ (పి.డి) ఆర్డర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కన్ఫర్మేషన్ చేస్తుందని తెలిపారు. సమాజంలో మట్కా, గుట్కా, గ్యాంబ్లింగ్, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎవ్వరయిన తమ పద్దతులను మార్చుకోవాలని, ఎవ్వరూకూడా చట్టానికి విరుద్దముగా వ్యవహరించరాదని ఆ విధంగా చట్టానికి విరుద్ధముగా వ్యవహారించే వారి సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం ఇవ్వగలరు. సమాచారం ఇచ్చిన వారి వివరములు గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రస్తుతానికి నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలలో గల అన్ని పోలీస్ స్టేషన్లలో నేరస్థుల వివరాలను వెలికితీయాలని అన్ని పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ లకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగానిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సమాజంలోని ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారిని మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని, సమాజ శాంతికి భంగం కలిగించే వారిపైన " నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామని, అలాంటి వారిపై  పి.డియాక్టు చట్టం క్రిందికి తీసుకురావడం జరుగుతుందని హెచ్చరించారు.

Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >
Image 1

పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకా వేయించాలి : మంత్రి దామోదర

Posted On 2026-06-27 07:11:39

Readmore >
Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >