| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దేవీ రోడ్ లో ట్రాఫిక్ పోలీసుల వన్ వే ఆంక్షల పై వ్యాపారుల ధర్నా

దేవీ రోడ్ లో ట్రాఫిక్ పోలీసుల వన్ వే ఆంక్షల పై వ్యాపారుల ధర్నా

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని దేవీ రోడ్ లో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు విధించిన వన్ వే ఆంక్షలకు నిరసనగా శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడి వ్యాపారస్తులు మాట్లాడుతూ నిజామాబాద్ లోనే కేంద్ర బిందువుగా వ్యాపారస్తులకు ప్రధాన మార్గమైన దేవీ రోడ్డులో గత కొన్నేళ్లుగా 2వే గా కొనసాగుతూ వస్తూ ఉంటే కొత్తగా ట్రాఫిక్ పోలీసులు ఆ రహదారిపై వన్ వే నిబంధనలు విధించడం సరికాదని దీనివల్ల ఎంతోమంది జిల్లా నలుమూలల నుండి వచ్చే ప ప్రజలకు వన్ వే వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు  వన్ వే ఆంక్షలను ఎత్తివేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Previous అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ
Next సైబర్ నేరాల మీద రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా జిల్లాలో ఓ వ్యక్తిపై పి.డి కేసు నమోదు
ADVERTISEMENT