| Daily భారత్
Logo




అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ

News

Posted on 2025-10-11 12:31:35

Share: Share


అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ

అర్బన్ నియోజకవర్గ అభివృద్ధిపై వివక్ష చూపితే సహించేది లేదు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి కేరాఫ్ అడ్రస్ అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడ కూడా అవినీతి తప్ప అభివృద్ధి పనులు చేయడంలో ఆ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుండి నియోజకవర్గం అభివృద్ధి కోసం సీఎం దృష్టికి పలుసార్లు తీసుకోవచ్చామని అయినప్పటికీ తాము తీసుకువెళ్లిన పలు అంశాలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా రాష్ట్ర సర్కార్ బిజెపి ఎమ్మెల్యేలపై చవితి ప్రేమ చూపిస్తుందని ఇది అంతగా మంచిది కాదని ఆయన అన్నారు. అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి పై రాష్ట్రశాఖ వివక్ష చూపితే ఇక సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కావలసిన నిధులు వేచ్చించాల్సిందిగా వినతి పత్రం అందించడం జరిగిందని ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. ఒకవేళ నియోజకవర్గ అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేదే లేదని రోడ్లపై వచ్చి నిరసనలు తెలుపుతామని ఆయన హెచ్చరించారు. తాను ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి  చేశారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజల బతుకులు ఆగమయ్యాయని ఏ ఒక్కరి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా లేరని ఆయన అన్నారు. ఒకప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ జిల్లాగా ప్రసిద్ధి చెందిన ఇందూరు జిల్లా ఇప్పుడు రైతులకు పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని అన్నారు. రైతులను పట్టించుకునే నాడుడే కరువయ్యారని ఆయన మండిపడ్డారు ఇటీవల వరదల బీభత్సంతో పంటల నష్టంతో రైతులు తీవ్రంగా దెబ్బతింటే వారికి నష్టపరిహారం చెల్లించడంలో, ఎంత నష్టం జరిగిందో కూడా నివేదిక కూడా తయారు చేయలేని అసమర్ధత ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు అందుకే కాంగ్రెస్ పార్టీ రైతు పక్ష పార్టీ కాదని, రైతుబక్ష పార్టీ అని అన్నారు. అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు వెంటనే అందించాలని సీఎంకు కోరినట్లు తెలిపారు. గత 12 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వ ల హయాంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఒక్క నిరుపేదల ప్రజలకు కూడా అర్బన్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వని ప్రభుత్వాలు అని విమర్శించారు. ఇక ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద జిల్లాగా నిజామాబాద్ జిల్లాకు ఓ పేరు ఉందని కానీ నిజామాబాద్ బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుందని ప్రయాణికులకు అన్ని వసతులతో కూడిన ఒక విశాలమైన బస్టాండ్ నిర్మించాలని ముఖ్యమంత్రికి  వివరించినట్లు తెలిపారు. అలాగే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్ ఆర్ ఐ వ్యవస్థ, డాక్టర్ల కొరత లేకుండా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రజలకు కావాల్సిన అన్ని రకాల వైద్య సదుపాయాలు అందే విధంగా ప్రభుత్వం చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఆర్ఓబి పనుల్లో కేంద్రం పూర్తిగా నిధులు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అప్పటి బి ఆర్ ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేయకుండా ఆర్ఓబి నిధులు విడుదల చేయకపోవడం వారి చేతకాని తనానికి నిదర్శనమని అన్నారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు మాస్టర్ శంకర్, న్యాలం రాజు, నిచ్చేంగ్ లతా కృష్ణ, పుట్ట వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >
Image 1

పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకా వేయించాలి : మంత్రి దామోదర

Posted On 2026-06-27 07:11:39

Readmore >
Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >