| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిగిరి రమేష్ హత్య కేసులో ప్రధాన నిందితుడు చిర్రం రవి అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

News

Posted on 2025-10-11 16:07:07

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిగిరి రమేష్ హత్య కేసులో ప్రధాన నిందితుడు చిర్రం రవి అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

మరో ఇద్దరు నిందితులు గతంలోనే రిమాండ్‌

కేసు ఛేదనలో కృషి చేసిన సిబ్బందికి రివార్డు..

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:​భూమి, ఫ్లాట్ల విషయంలో తలెత్తిన వివాదం ఓ హత్యకు దారితీసింది. సిరిగిరి రమేష్ అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురికాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడైన చిర్రం రవిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శేషాద్రిని రెడ్డి తెలిపారు. ఈ కేసులో గతంలోనే మరో ఇద్దరు నిందితులు ఎద్దండి వెంకటేష్, అలా వంశీలను రిమాండ్‌కు తరలించడం జరిగింది.

​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

సిరిగిరి రమేష్‌ కు చిర్రం రవి చందుర్తిలో ఉన్న తన భూమిని ఎస్సీ కార్పొరేషన్ లోన్ పై పెట్రోల్ బంక్ నిమిత్తం రిజిస్ట్రేషన్ చేశాడు. అయితే, సిరిగిరి రమేష్ పెట్రోల్ బంకు ఇవ్వకపోగా, భూమిని తిరిగి రవికి రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. దీంతోపాటు, ఈ భూమి నాదే అంటూ దాన్ని ఇతరులకు అమ్మడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అంతేకాకుండా, సిరిగిరి రమేష్ చాలా ఫ్లాట్లను డబుల్ రిజిస్ట్రేషన్ చేశాడని, ఆ ఫ్లాట్ల కొనుగోలుకు మధ్యవర్తిగా ఉన్న చిర్రం రవితో ఆ విషయంలోనూ గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. ​ఈ పరిణామాలతో ఆగ్రహం చెందిన చిర్రం రవి, తన భూమి తనకు దక్కాలంటే రమేష్‌ను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఎద్దండి వెంకటేష్, అలా వంశీలతో కలిసి పథకం ప్రకారం హత్యకు పాల్పడ్డాడు. ​తేదీ 19-09-2025 రోజున రాత్రి సుమారు 08:00 గంటల సమయంలో పెద్దూరు సబ్ స్టేషన్ సమీపంలో కారు ఆపి, కారులో నిద్రిస్తున్న సిరిగిరి రమేష్‌ను అలా వంశీ గట్టిగా కాళ్లు పట్టుకొని ఉండగా, చిర్రం రవి వెనుక సీటులో కూర్చొని కదలకుండా పట్టుకున్నాడు. ఆ సమయంలో డ్రైవర్ సీటులో ఉన్న ఎద్దండి వెంకటేష్ వారు తెచ్చుకున్న కత్తితో రమేష్ గొంతులో, ఛాతీపై పలు మార్లు పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం, సిరిగిరి రమేష్ మరణించినట్లు నిర్ధారించుకొని, ఎద్దండి వెంకటేష్ శవాన్ని కారులో తీసుకువచ్చి వేములవాడలోని నంది కమాన్ సమీపంలో గల రమేష్ యొక్క నందీశ్వర టౌన్ షిప్ వెంచర్ లో కారు వదిలిపెట్టి పారిపోయారు. ​ఈ కేసులో ప్రధాన నిందితుడైన చిర్రం రవిని శనివారం పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులైన ఎద్దండి వెంకటేష్ మరియు అలా వంశీలను గతంలోనే రిమాండ్‌కు తరలించడం జరిగింది. ​ఈ కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన ఎస్సై రామ్మోహన్, సిబ్బంది తిరుపతి, సమియుద్దిన్, రాజకుమార్, పాష, గోపాల్ లను రివార్డుతో అభినందించడం జరిగింది

Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >
Image 1

పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకా వేయించాలి : మంత్రి దామోదర

Posted On 2026-06-27 07:11:39

Readmore >
Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >