Posted on 2025-10-10 20:46:01
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు అవసరమగు క్రీడా మైదానాలు లేకపోయినప్పటికీ తమ ప్రతిభ వల్ల, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించడం ఇంజూర్ జిల్లా క్రీడాకారుల గొప్పతనమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ అన్నారు. టైక్వాండో టోర్నమెంట్ క్రీడల మూడు రోజుల క్రీడలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఒకవైపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీస్తుంటే రాష్ట్రంలో మాత్రం గత ప్రభుత్వం మాత్రం క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఎలాంటి క్రీడా మైదానాలు లేకపోయినప్పటికీ జిల్లా కేంద్రంలో అర్బన్ నియోజకవర్గంలోని క్రీడాకారులు జిల్లా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటటం గొప్ప విషయం అన్నారు. క్రీడాకారులకు అవసరమగురే క్రీడా మైదానాలు జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే జిల్లాలో ఉన్న క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. గతంలో జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఓ క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు వినతి పత్రాలు అందించినప్పటికీ క్రీడమైదానాలు ప్రభుత్వం కేటాయించకపోవడం దారుణం అన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశంలో జిల్లాలో క్రీడా మైదానం ఏర్పాటు కోసం క్రీడాకారులకు అన్ని వసతులతో కూడిన క్రీడా మైదానం ఏర్పాటుకు ప్రభుత్వంపై వట్టిది తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామన్నారు.
మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >