Posted on 2025-10-06 12:28:19
మొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, నిన్న కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అసంతృప్తి జ్వాల
జిల్లాలో ఆ ఒక్క ఎంపీ ఉంటే పోకడ వల్లే సమన్వయం లోపిస్తుందoటున్న రాజకీయ విశ్లేషకులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: పల్లెల్లో స్థానిక సంస్థలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి జిల్లాలో బిజెపి ముఖ్య నేతలు, ఎమ్మెల్యేల లో సమన్వయం లోపించడంతో బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆ ఇద్దరు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు. ఒకరు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మరొకరు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి లు ఏకంగా పార్టీ వ్యవహార శైలిపై నిరాశలు ఉన్నట్లు సమాచారం. ఆదివారం హైదరాబాద్లో జరిగిన స్థానిక సంస్థల సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్రమణారెడ్డి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముందే తనలో ఉన్న భావోద్వేగాన్ని వారి ముందు వెళ్ళగక్కారు. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం ఎందుకు లోపించిందని, రాష్ట్రంలో పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నాలుగు గోడల మధ్య కూర్చొని మాట్లాడితే సరిపోతుందా అని వారిని అడిగారు. క్షేత్రస్థాయిలో గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజల అవసరాలు ఏంటో తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయాలి తప్ప ఇలా చేస్తే భవిష్యత్తులో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోరా అని ప్రశ్నించారు. ఇక ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇటీవల ఓ ప్లెక్సీ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆ ఫ్లెక్సీలో జిల్లా అధ్యక్షుడు తన ఫోటోను లేకుండా తనను అవమానించారని ఆ ఎమ్మెల్యే అసంతృప్తితో, నిరాశతో వెను తిరిగారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి ఎంపీ ధర్మపురి అరవింద్ ఒంటెద్దు పోకడల వల్లే బిజెపి ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్య సీనియర్ నేతల మధ్య సమన్వయం లోపించిందని ఆ పార్టీలోనే కొందరు నేతలు లో లోపల చర్చించుకుంటున్నారు. ఇటు రాజకీయ విశ్లేషకులు సైతం ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడలను వీడి ఎన్నికల సమయంలో అందరిని కలుపుకొని పోతే పార్టీ విజయం సాధిస్తుందని లేదంటే ఎవరి దారి వారు చూసుకోక తప్పదని జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >