| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని పరామర్శించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని పరామర్శించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి తల్లి లక్ష్మీ నర్సమ్మ  మృతిపట్ల సానుభూతి తెలియజేస్తూ, బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి  సుదర్శన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, ఎన్‌డీసీసీ బ్యాంకు అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి లు ఆదివారం నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు లక్ష్మీ నర్సమ్మ  చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎ ఏం సి  చైర్మన్  ముప్పా గంగారెడ్డి,  డీసీసీ  ప్రధాన కార్యదర్శి  భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

Previous ప్రజలను అనునిత్యం చైతన్య పరుస్తున్న నిజామాబాద్ పోలీస్ కళాబృందం
Next బిసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
ADVERTISEMENT