Posted on 2025-10-05 17:31:19
నా డిక్షనరీలో రెండే రెండు పదాలకు స్థానం నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, వారికి సేవ చేయాలనే సంకల్పం
పట్టణ ఆర్యవైశ్య సంఘం దసరా ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిసాన్ గంజ్ లో ఆదివారం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దసరా సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మున్సిపల్ నిజామాబాద్ చైర్మన్ ముక్కా దేవేందర్ గుప్తా పట్టణ ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి కోసం నిరంతరంగా పనిచేస్తూ వస్తున్నారని తనను చూసి నేటితరం ఆర్యవైశ్యులు ఆదర్శంగా తీసుకొని పార్టీలకు అతీతంగా అందరం ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి చేయాలని పిలుపునిచ్చారు. మహిషాసుర రాక్షసున్ని అమ్మవారు అంతముందించినందుకే హిందువులందరము అధర్మం మీద ధర్మం గెలిచిందని దసరా పండగ జరుపుకుంటామని ఆయన అన్నారు. ఇప్పటినుంచి అయినా వచ్చే దసరా వరకు అందరిలోని దుర్గుణాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో గడుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్యవైశ్యులు ఇతర పార్టీలలో ఉన్నప్పటికీ అంతిమ లక్ష్యం ఆర్యవైశ్యుల అభివృద్ధి ద్యేయం పెట్టుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీలకతీతంగా ఆర్యవైశ్యులం ఐక్యంగా ఉండి పనిచేద్దామని అప్పుడే తెలంగాణ రాష్ట్రంలోనే నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం సేవలు అభివృద్ధిలో ముందు వరుసలో నిలబడాలని ఆయన అన్నారు. తన డిక్షనరీలో రెండే రెండు పదాలకు చోటు ఉంటాయని ఒకటి తనను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, రెండు నా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నానని ఆయన అన్నారు. అలాగే తన ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని భరోసానిచ్చారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల ప్రభాకర్ గుప్తా, కోశాధికారి గాలి నాగరాజు గుప్తా, ప్రోగ్రాం కన్వీనర్లు వీరమల్లి రమేష్ గుప్తా, పబ్బరాజు గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించారు.
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >