| Daily భారత్
Logo




ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది : భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్

News

Posted on 2025-10-05 11:34:49

Share: Share


ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది :  భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది :  భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్  ఆదేశాల మేరకు చర్ల మండలంలోని ఛత్తీస్ఘడ్ రాష్ట్ర సరిహద్దు గ్రామాలైన బట్టిగూడెం,బత్తినపల్లి మరియు రామచంద్రాపురం గ్రామాలను భద్రాచలం ఏఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్ సందర్శించారు.CRPF 141Bn కంపెనీ కమాండర్ సెబాస్టియన్,చర్ల సీఐ రాజు వర్మ మరియు ఇతర పోలీస్ అధికారులు,సిబ్బందితో కలిసి ఈ మూడు మావోయిస్ట్ ప్రభావిత గ్రామాల్లోని 120 కుటుంబాలను సందర్శించారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ఈ మూడు గ్రామాల ప్రజలకు nestle కంపెనీ వారి సహకారంతో నిత్యావసర వస్తువులను అందించారు.ఈ సందర్భంగా ఏఎస్పీ  మాట్లాడుతూ జిల్లా ఎస్పీ  సారథ్యంలో ఏజెన్సీ ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని,మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలకు విద్య,వైద్యం,రవాణా వంటి కనీస సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.ఇందులో భాగంగానే జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసించే అదీవాసీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వర్షాల అనంతరం పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.డెంగీ,మలేరియా వంటి విషజ్వరాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.అభివృద్ధి నిరోధకులైన నిషేదిత మావోయిస్టులకు ఎవ్వరూ సహకరించవద్దని కోరారు.ప్రత్యక్షంగానైనా,పరోక్షంగానైనా మావోయిస్టులకు సహకరిస్తే,అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొనబడతాయని అన్నారు.మారుమూల ఏజెన్సీ ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించడానికి ముందుకొచ్చిన Nestle కంపెనీ వారికి ఈ సందర్బంగా ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >
Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >