| Daily భారత్
Logo




దమ్మపేట సర్పంచ్ టికెట్ యాదవులకు కేటాయించాలి

News

Posted on 2025-10-01 11:02:33

Share: Share


దమ్మపేట సర్పంచ్ టికెట్ యాదవులకు కేటాయించాలి

డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం ఈసారి బీసీ మహిళా రిజర్వేషన్‌గా ఖరారైంది. ఈ నేపథ్యంలో సర్పంచ్ టికెట్ కేటాయింపుపై స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చలు చురుగ్గా సాగుతున్నాయి.గతంలో దమ్మపేట అభివృద్ధి కోసం యాదవ సమాజానికి చెందిన నాయకులు, యువకులు చేసిన కృషిని గుర్తుచేస్తూ, ఈసారి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ టికెట్ యాదవ సమాజానికి కేటాయించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. యాదవులకు బలమైన ఓటు బ్యాంకు ఉండటమే కాక, పలు ఎన్నికల్లో పార్టీ గెలుపు దిశగా వారు కీలక పాత్ర పోషించారని స్థానిక నేతలు చెబుతున్నారు.సమాజ అభ్యున్నతి, అభివృద్ధి పనుల్లో ముందుండే యాదవ మహిళకు అవకాశం ఇవ్వాలని, అప్పుడు మాత్రమే ప్రజల్లో నమ్మకం పెంపొందుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్ కేటాయింపులో సమాజాల మధ్య సమతుల్యతను కాపాడే దిశగా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా దమ్మపేటలో యాదవ సమాజాన్ని పట్టించుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్‌ను అశ్వారావుపేట శాసనసభ్యులు, విద్యావంతులు  జారే ఆదినారాయణ ను స్థానిక నాయకుడు, కాంగ్రెస్ పార్టీ గ్రామ కార్యదర్శి తాళ్ళ శంకరరావు యాదవ్ కోరుతున్నారు.

Image 1

మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్

Posted On 2026-07-02 17:57:45

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..

Posted On 2026-07-02 17:51:43

Readmore >
Image 1

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-02 17:42:33

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు

Posted On 2026-07-02 12:30:41

Readmore >
Image 1

ఎస్సైని లంచ్‌ టైం వరకు నిలబెట్టిన హైకోర్టు!

Posted On 2026-07-02 12:29:56

Readmore >
Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >