Posted on 2025-09-30 23:04:23
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన.. బాధితురాలు ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..
కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో వివాహితపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేయడంతో ఈ విషయం బహిర్గతమైంది. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలానికి చెందిన వివాహిత(25) కు నిజామాబాద్ నగరంలోని ఆటో నగర్ కు చెందిన మోయిన్ ఇటీవల పరిచయమయ్యాడు. మోయిన్ సెంట్రింగ్ పనిచేసే క్రమంలో బిల్డింగ్ ఎదురుగ గల ఇంటికి చెందిన వివాహితతో పరిచయం పెంచుకుని ఆమెను, కుమారుడితో పాటు మాయమాటాలు చెప్పి నిజామాబాద్ రూరల్ మండలంలోని ఓ ఇంటికి తీసుకువెళ్లాడు. ఈ నెల 11న రాత్రి వివాహితకు, ఆమె కుమారుడికి తినే వాటిలో మత్తు పదార్థం ఇచ్చి సృహకోల్పోయేలా చేశాడు. అక్కడ మోయిన్ తో పాటు ఖయ్యూం, ఆమేర్ లు వివాహితపై అత్యాచారం చేశారు. గత కొన్ని రోజులుగా వివాహితపై ముగ్గురు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ నెల 26న చివరి సారిగా ముప్కాల్ మండలంలోని ఓ ఇంటివద్ద వివాహితపై మోయిన్ అత్యాచారం చేశాడు. అక్కడి నుంచి ఈ నెల 27న నాగారం తీసుకువెళ్లి ముల్ సాబ్ ను కలిసి వస్తాను అని చెప్పి అక్కడ వదిలి పరారి అయ్యాడు. బాధితురాలు తనపై జరిగిన ఆఘాయిత్యంపై స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసి మోయిన్, ఖయ్యుం, అమేర్ లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్టు నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేష్ తెలిపారు.
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >