Posted on 2025-09-29 22:40:42
నగరం నలుమూలల నుండి తీరోక్క పూలతో పేర్చిన బతుకమ్మను ఆడుతూ పాడుతూ నిమజ్జనం చేసిన ఆడపడుచులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తొమ్మిది రోజులపాటు తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఆత్మగౌరవంగా గౌరమ్మను పూజిస్తూ ప్రకృతిలో కాసిన పూలను పేర్చి 9వ రోజు సద్దుల బతుకమ్మ పేరిట నిజామాబాద్ నగరంలోని బొడ్డెమ్మ చెరువు వద్ద పెద్ద సంఖ్యలో మహిళా ఆడపడుచులు తాము తయారు చేసిన బతుకమ్మలను ఆడుతూ బతుకమ్మ డీజే పాటలతో నగరంలోని బొడ్డెమ్మ చెరువు ప్రత్యేక శోభను సంతరించుకుంది. నగరం నలుమూలల నుండి పెద్ద ఎత్తున మహిళా మణులు ఇక్కడికి వచ్చి తమను తమ కుటుంబాన్ని చల్లగా చూడాలంటూ బతుకమ్మ తల్లిని గౌరమ్మతో పేర్చి దీపాంతల్లో బతుకమ్మను ఉంచి నిమజ్జనం చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకమైన పండగలో ముఖ్యమైన బతుకమ్మను తాము ఈ సంవత్సరం ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా గడిపామని మహిళా మణులు ఆనందోత్సవాల నడుమ డీజే బతుకమ్మ పాటలకు నృత్యాలు చేసి అలరించారు. ఇదిలా ఉండగా నగరానికి చెందిన ఓ మహిళ బతుకమ్మలు చివరి రోజైన సద్దుల బతుకమ్మ సందర్భంగా వివిధ రకాల పూలను పేర్చి బతుకమ్మను తయారుచేసి దానిపై అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి దానిపై పల్లకీని తయారుచేసి బొడ్డెమ్మ చెరువుకు తీసుకువచ్చారు. ఈ బతుకమ్మ అన్ని బతుకమ్మలో కంటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...
Posted On 2026-07-03 09:50:18
Readmore >
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >