డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అజీజ్‌నగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవంలో ఆయన ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో చాలా మంది ఇల్లు లేని నిరుపేదలను అధికారులు గుర్తించి, ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వారిని తహసీల్దార్ ఆధ్వర్యంలో ఎంపిక చేసి సోమవారం వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ప్రారంభించి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారని తెలిపారు. పేదవారి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు సంబంధించిన వాటర్ కనెక్షన్, వీధి దీపాలు, సీసీ రోడ్డు, కరెంటు పనులను త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. సమస్యలు లేని కాలనీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ, మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్ కుమార్, మాజీ జెడ్పిటిసి కాలే శ్రీకాంత్, పీఏసీఎస్ చైర్మన్ చంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్, కార్యవర్గ సభ్యులు షాబాద్ దర్శన్, ఫిషర్‌మెన్ చైర్మన్ మహేందర్ ముదిరాజ్, పల్లగొల్ల అశోక్ యాదవ్, పట్నం రామ్ రెడ్డి, ఎలిగేపల్లి శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రేనేట్ల రాజు గౌడ్, యాదయ్య, కుమ్మరి శంకర్, యాదగిరి చారి, రమేష్ ముదిరాజ్, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
News
పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం : జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి