| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

స్థానిక ఎన్నికలకు సంక్షేమ పథకాలే మా బలం: భట్టి విక్రమార్క

స్థానిక ఎన్నికలకు సంక్షేమ పథకాలే మా బలం: భట్టి విక్రమార్క

డైలీ భారత్ ,హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల మనసు గెలుచుకున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక, పరిపాలనా వ్యవస్థలు దెబ్బతిన్నాయని విమర్శిస్తూ, వాటిని సరిచేస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించామన్నారు.  60,000 ఉద్యోగాలు, 21 వేల కోట్ల రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, బోనస్, ఇళ్లు, ఉచిత బియ్యం పంపిణీ, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, వడ్డీలేని రుణాలు వంటి పథకాలను వివరించారు.

Previous నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి మాతృవియోగం
Next పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం : జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
ADVERTISEMENT