Posted on 2025-09-29 08:53:18
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల పట్టణానికి చెందిన పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త, విమర్శకుడు, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫోరం సభ్యుడు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్‌కి డా. వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య తొలి పురస్కారం ప్రధానం చేశారు.
తెలుగు సాహిత్యానికి విశిష్టమైన సేవలు అందిస్తూ కవిగా, కథారచయితగా, విమర్శకుడిగా, సంపాదకీయకర్తగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన డా. చిటికెన కిరణ్ కుమార్ వంద పైచిలుకు పత్రికల్లో కథలు, కవితలు, వ్యాసాలు అనేకంగా రచించారు.ఈ సాహిత్య సేవలను గుర్తించి అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం వారు తెలంగాణ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం అఫ్జల్ గంజ్ హైదరాబాదులో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయ అధ్యక్షులు డా. రియాజ్ అలీ, పద్మశాలి అన్నసత్రాల మార్గదర్శకులు చిలువేరి కాశీనాథ్, అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు తుమ్మ సత్యనారాయణ, బైరి శ్రీనివాస్ లు శాలువా, మెమెంటో, వస్త్ర కిరీటం పూలమాల, ప్రశంసా పత్రాలతో డా. చిటికెన కిరణ్ కుమార్‌ను ఘనంగా సత్కరించారు.
ఈ అవార్డు, వేలాది లలితగీతాలను రచించిన జాతీయ కవి, మహాకవి, సినీ గేయరచయితగా ఖ్యాతి పొందిన స్వర్గీయ డా. వడ్డేపల్లి కృష్ణ గారి స్మారకార్థంగా ప్రారంభించబడింది. తెలుగు సాహిత్యం, సినీ రంగం, సంగీతానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అతిథులు గుర్తు చేశారు.
ఈ సందర్భంగా అవార్డును స్థాపించిన అఖిలభారత పద్మశాలి సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి సూరేపల్లి రవికుమార్ మాట్లాడుతూ, డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ సాహిత్య ప్రయాణం కొత్త తరాలకు ప్రేరణనిస్తుందని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్వ జాయింట్ డైరెక్టర్ పాలడుగు సరోజినీ దేవి, ప్రముఖ కవయిత్రి డా. రాధాకుసుమ, తుమ్మ జనార్ధన్, సత్యవీణ మొండ్రేటి తదితరులు కవులు, రచయితలు పాల్గొన్నారు. ప్రత్యేకంగా నిర్వహించిన కవి సమ్మేళనం సాహిత్యాభిమానులను ఆకట్టుకుంది.
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >