నర్సంపేట /నల్లబెల్లి, డైలీ భారత్ న్యూస్: మండల ప్రజ లందరూ దసరా ఉత్సవా లను ప్రశాంత వాతావర ణంలో జరుపుకోవాలని నర్సంపేట ఏసీపీ పున్నం రవీందర్ రెడ్డి అన్నారు.ఆదివారం ఏసీపీ నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఏసీపీ మాట్లాడుతూ మండల ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మన రాష్ట్రంలో అత్యంత ప్రధాన మైన పండుగలలో గొప్ప పండుగ సద్దులు బతుకమ్మ పండుగ , దసరా అన్నారు. ప్రజలందరూ ఐకమత్యంతో శాంతియుత వాతావరణం లో పండుగ జరిగేలా అందరూ సహకరించాలని సూచించారు ప్రజాప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు అధికారులు ఉత్సవాల సందర్భంగా ఎవరూ చట్టంగానే ఉల్లగించకూడదని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి గొడవలకు తావివ్వకుండా మండల ప్రజలందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు. ఈకార్యక్రమంలో గ్రామీణ , సీఐ సాయి రమణ, ఎస్‌ఐ గోవర్ధన్, వివిధ పార్టీల నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
News
మండల ప్రజ లందరూ దసరా ఉత్సవా లను ప్రశాంత వాతావర ణంలో జరుపుకోవాలి : నర్సంపేట ఏసీపీ పున్నం రవీందర్ రెడ్డి