Posted on 2025-09-28 21:31:53
పువ్వులను పూజించడం మన తెలంగాణ గొప్ప సాంస్కృతి
కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జిల్లా పోలీసు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:
నిజామాబాద్ నగరంలోని స్థానిక విజయలక్ష్మి గార్డెన్ హాల్ లో ఆదివారం నిజామాబాదు, ఆర్మూర్, బోధన్ డివిజన్ పోలీసు సిబ్బంది , పోలీస్ కార్యాలయం సిబ్బంది , రేంజ్ కార్యాలయం సిబ్బంది , హోమ్ గార్డ్స్ సిబ్బంది, అలైడ్ బ్రాంచ్ ల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో బతుకమ్మ సంబరాలను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య కుటుంబ సభ్యులతో పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు మాట్లాడుతూ పోలీసు వారి కుటుంబ సభ్యులతో బతుకమ్మ ఆడడం ఇంత మంది కుటుంబ సభ్యులను కలిసినందుకు వారితో బతుకమ్మ సంబరాల్లో పాల్గొనందుకు ఆనందంగా ఉందని తెలియజేశారు. తెలంగాణ సాంస్కృతికి చారిత్రక చిహ్నం బతుకమ్మని మరియు తెలంగాణ సాంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని అని అన్నారు. జిల్లా ప్రజలకు బతుకమ్మ , విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో ఆడుతూ, ఐక్యత, సోదరభావం, ప్రేమను కలిపి రంగరిస్తూ మానవహారం ఏర్పరిచి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి (అడ్మిన్) జి. బస్వా రెడ్డి , అదనపు డిసిపి (ఏఆర్) రామచంద్రరావు , నిజామాబాద్ , ఆర్మూర్, బోధన్ ఏసిపి లు రాజా వెంకటరెడ్డి , శ్రీనివాస్ , వెంకటేశ్వర్ రెడ్డి , సిఐలు , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు , ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >