| Daily భారత్
Logo




తిర్మన్ పల్లి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తా..

News

Posted on 2025-09-28 19:08:53

Share: Share


తిర్మన్ పల్లి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తా..

రేణుక మాత ఎల్లమ్మ ఆలయ పునర్నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తాం

రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తిర్మన్ పల్లి గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. ఆదివారం తిర్మన్ పల్లి గ్రామంలోని రేణుక మాత ఎల్లమ్మ ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో అండగా నిలిచిన తిర్మన్ పల్లి గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని, అయితే బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు కుట్రపూరితంగా అడ్డంకులు సృష్టిస్తున్నాయని విమర్శించారు."జీవో విడుదలైన వెంటనే కొందరు కోర్టుల్లో కేసులు వేసినా, బీసీ రిజర్వేషన్ల హామీని తప్పకుండా అమలు చేస్తాం" అని భూపతి రెడ్డి స్పష్టం చేశారు. అలాగే బీసీ సమాజానికి గౌరవం కల్పించేందుకు మహేష్ కుమార్ గౌడ్‌ను టిపిసిసి అధ్యక్షుడిగా నియమించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని 15 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేవని విమర్శించారు. "ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ఆలయ పునర్నిర్మాణానికి నా వంతు సహకారం అందిస్తాను" అని భూపతి రెడ్డి హామీ ఇచ్చారు. తరువాత గౌడ సంఘ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ముదిరాజ్, మాజీ ఎంపిటిసి చింతల కిషన్, నల్లవెల్లి సహకార సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిన్ రెడ్డి సంతోష్ రెడ్డి, కిసాన్ ఖేత్ అధ్యక్షులు ఎల్ఐసి గంగాధర్, గౌడ సంఘం అధ్యక్షులు రాజా నర్సాగౌడ్, శ్రీనివాస్ గౌడ్, జంగిలి లక్ష్మి, బోక్క గంగాధర్, గోపు గోపాల్, సాదు రవి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గౌడ కుల సంఘ సభ్యులు మరియు గ్రామానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >