Posted on 2025-09-28 19:10:17
ఆడపడుచులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి..
డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: సద్దుల బతుకమ్మ సందర్బంగా నగరంలో ఉన్న బొడ్డెమ్మ చెరువు వద్ద బతుకమ్మ ఘాట్ ను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మున్సిపల్ కమీషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగకు విశేష స్థానం ఉందన్నారు. తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు ప్రకృతిని పార్వతి దేవిగా పూజిస్తూ ఆనందోత్సవాల మధ్య ఆఖరి రోజున సద్దుల బతుకమ్మగా నిమజ్జనం చేయడం అనవయితీగా వస్తుందని అన్నారు. సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని నగరంలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే నేపథ్యంలో, ఘాట్ వద్ద పరిశుభ్రత, కాంతివంతమైన విద్యుత్ వెలుగులు, త్రాగు నీరు, ఇతర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ నిమజ్జనం సమయంలో చిన్న పిల్లల పట్ల తల్లితండ్రులు జాగ్రత్త వహించాలని అన్నారు. ఈ పండుగను ప్రజలంతా ఆనందంగా, భద్రతగా జరుపుకోవాలని సూచిస్తూ, అవసరమైన అన్ని ఏర్పాట్లను సమయానుకూలంగా పూర్తిచేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి ఈ సుదర్శన్ రెడ్డి, ఏ ఈ ఇనాయత్ అలీ,మున్సిపల్ సిబ్బంది తాజా మాజీ కార్పొరేటర్లు ఇల్లేందుల మమతా, ప్రభాకర్, వెల్డింగ్ నారాయణ, బీజేపీ నాయకులు చిరంజీవి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >