Posted on 2025-09-28 19:07:40
ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:మహారాష్ట్ర ఎగువ ప్రాంతం నుండి భారీ వర్షాల కారణంగా దిగువ ప్రాంతమైన తెలంగాణలోని కందకుర్తి, బాసర గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తుంది.
గోదావరితో బాసరకు వరద ముప్పు పొంచి ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు బాసర గోదావరి ఉగ్ర రూపిణిగా ప్రవహిస్తూ ప్రస్తుతం స్నాన ఘాట్లపైకి వరద నీరు చేరుకుంది. గోదావరి- బాసర ఆలయం రహదారిలో గల పలు లాడ్జిల్లో, ఇళ్లల్లో బ్యాక్ వాటర్ చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రస్తుతం బాసరలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో ముఖ్యఘట్టమైన అమ్మవారు పుట్టిన మూలా నక్షత్రం సోమవారం రావడంతో భక్తులు అమ్మవారిని ప్రత్యక్షంగా తిలకించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో బాసర తరలివచ్చే అవకాశం ఉంది అయితే బాసరను వరదలు అతలాకుతలం చేయడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వరద నీరు బాసర ఆలయ పుర వీధులకు చేరడానికి 100 అడుగుల దూరంలో ఉంది. దీంతో వర్తక వ్యాపారులు గతంలో జరిగిన వరద అనుభవాల దృష్టిలో పెట్టుకుని తమ వ్యాపారం అటు ఉంచితే తాము క్షేమంగా బ్రతికితే చాలు అనుకొని వ్యాపారస్తావరాలను ఎత్తివేసే పనులు ఉన్నారు.
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >