Posted on 2025-09-28 11:20:51
అత్యవసరమైతే డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీస్ వారి సేవలు పొందండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నదులు, వాగులు, వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి నడకన మరియు వాహనాలతో ప్రజలు రోడ్లు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ సూచించారు.సెల్ఫీల కోసం ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రదేశాలకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని తెలిపారు నదులు, వాగులు, వంకల వద్దకు జాలర్లు, ప్రజలు చేపల వేటకు వెళ్ళకూడదని సూచించారు. పశువుల కాపలా దారులు నదులు, వాగులు,వంకల పరిసర ప్రాంతాల దగ్గరకు వెళ్లకూడదని సూచించారు. సాధ్యమైనంత వరకు అత్యవసర సమయాల్లో తప్ప మిగిలిన సమయాలలో బయటకు రాకుండా ఉండడానికిప్రయత్నించవలసిందిగా సూచించారు.జిల్లా పోలీసు యంత్రాంగం ఇతర శాఖలతో కలిసి ఇప్పటికే వర్షాల కారణంగా ప్రమాదకరంగా మారుతున్న రహదారులు మరియు చెరువులు,వాగులు,నదుల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేసారు.జిల్లా పోలీస్ శాఖ తరపున 24×7 అందుబాటులో ఉండే విధంగా డిడిఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచడం జరిగిందని తెలిపారు.ప్రజలు ఎవరైనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం అందించి పోలీసు వారి సేవలను పొందాలని కోరారు.ప్రమాదాలు వాటిల్లకుండా పోలీసు చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >