అక్కడికక్కడే యువకుడుమృతి, పలువురికి తీవ్రగాయాలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద హైవే 63పై శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ సంజీవ్ తెలిపిన వివరాల ప్రకారం.. లక్కోర నుంచి మోర్తాడ్ వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో దినేష్ (26) అక్కడికక్కడే మరణించాడు. కార్తీక్, రాజ్ కుమార్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు ద్వారా విచారణ చేపట్టారు.