| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నిజామాబాద్ అర్బన్ క్యాంప్ కార్యాలయంలో ప్రధాని మన్ కి బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన అర్బన్ ఎమ్మెల్యే

నిజామాబాద్ అర్బన్ క్యాంప్ కార్యాలయంలో ప్రధాని మన్ కి బాత్  కార్యక్రమాన్ని వీక్షించిన అర్బన్ ఎమ్మెల్యే

స్వదేశీ వస్తువులను ఉపయోగిద్దాం - స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సాహిద్దాం

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:భారత దేశ  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 126వ మాన్ కీ బాత్ కార్యక్రమాన్ని  సుభాష్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  కంఠేశ్వర్ మండల బిజెపి నాయకులతో కలిసి అర్బన్ ఎమ్మెల్యేధన్ పాల్ సూర్యనారాయణ  వీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీనీ ఉద్దేశించి గొప్ప సందేశంతో పాటు ముఖ్యమైన అంశాలను ప్రస్థావించడం జరిగిందన్నారు. దేశ ప్రజలందరు స్వదేశీ వస్తువులను ఉపయోగిస్తూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని మాన్ కీ బాత్ వేదికగా ప్రధానమంత్రి దేశ ప్రజలకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా నినాదంతో దేశియా ఉత్పత్తులను ప్రోత్సాహిస్తూ సహకారం అందించడం జరుగుతుంది అన్నారు. భారతీయ మహిళలు తమ నారీ శక్తితో వివిధ రంగాలలో చూపిస్తున్న ప్రతిభను ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకునేల ఎదగడం గర్వకారణం అన్నారు. నావి, ఎయిర్, రక్షణ,రంగాలతో పాటు గ్రామీణ స్థాయి మహిళలు సైతం చిన్న, చిన్న కుటీర పరిశ్రమలతో అభివృద్ధిని సాధిస్తున్నారని తెలియజేసారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా RSS చేసిన సేవలను ప్రధాని గుర్తు చేయడం జరిగిందని అన్నారు. డా. కేశవ బలిరామ్ హెగ్డేవర్,గురూజీల స్ఫూర్తితో వారి ఆశయాలకు ఆకాంక్షాలకు అనుగుణంగా జాతీయ పునః నిర్మాణమే లక్ష్యంగా స్వయంసేవకులు పని చేయడం జరుగుతుందని అన్నారు. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని చరిత్రను ఆయన గొప్పతనాన్ని వాల్మీకి రాసిన రామాయణం సమస్త మానవాళికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. అయోధ్య రామ మందిర పునః నిర్మాణంతో హిందువులు చిరకాల స్వప్నం నెరవేరిందని గుర్తు చేసారు. దేవి నవరాత్రులు, దీపావళి కానుకగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు గొప్ప బహుమతిగా జీఎస్టీ  తగ్గింపులు చేసారని అన్నారు. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరటను ఇచ్చే విదంగా ఉందని అన్నారు. ప్రముఖ లలిత కళ రంగాలలో పేరు పొందిన వారికీ ప్రోత్సాహంగా పద్మశ్రీతో  గుర్తింపు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రముఖ గాయిని లత మంగేష్ కి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, జిల్లా సెక్రెటరీ జ్యోతి, మండల అధ్యక్షులు శక్తి కేంద్ర చార్జిలు  నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Previous వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
Next జల్సా లకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ముఠా సభ్యులు అరెస్ట్
ADVERTISEMENT