Posted on 2025-09-24 14:53:29
ప్రసవ వేదనతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గర్భిణీకి సరైన సమయంలో వైద్యం అందించి శిశువు తల్లిని కాపాడిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు
డైలీ భారత్, నిజామాబాద్ న్యూస్: నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక అత్యవసర ప్రసవ కేసు విజయవంతంగా నిర్వహించినట్లు ఆస్పత్రి సూపరిండెంట్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా, పోతంగల్ మండలం, కోటగిరి గ్రామానికి చెందిన సిమ్రన్ బేగం (వయసు 23 సంవత్సరాలు, మొదటి కాన్పు), భర్త మొహమ్మద్ రసూల్, 23 తేదీన ఉదయం 37 వారాలు 4 రోజుల గర్భకాలంలో ప్రసవ వేదనతో, తక్కువ ప్లేట్‌లెట్స్ (15,000 మాత్రమే) కలిగి ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్య బృందం సమయానికి జోక్యం చేసుకుని చికిత్స అందించి, ఉదయం 11:58 గంటలకు 2 కిలోల బరువున్న మగ శిశువు సజీవంగా జన్మించాడు. తల్లి ప్రాణాలను కాపాడటానికి 2 యూనిట్ల ఆర్ డి పి1 యూనిట్ ఎస్ డి పి ప్లేట్‌లెట్ ట్రాన్స్‌ఫ్యూషన్ ఇచ్చారు. తరువాతి పరీక్షల్లో ప్లేట్‌లెట్ లెక్క 57,000కి పెరిగింది. ప్రత్యేకంగా హౌస్ సర్జన్ డా. హేమంత్ పేషెంట్ కి ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉండడంతో సరైన సమయంలో రక్తదానం అందించి, తల్లి ప్రాణాలను రక్షించడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ విజయవంతమైన కేసులో వైద్య బృందం డా. లక్ష్మీ ప్రసన్న, ప్రొఫెసర్ డా. హారికా, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఆశ్రిత పోస్ట్‌గ్రాడ్యుయేట్ డా. రమ్య పోస్ట్‌గ్రాడ్యుయేట్,డా. రశ్మిత పోస్ట్‌గ్రాడ్యుయేట్ ,ప్రస్తుతం తల్లి, శిశువు ఇద్దరూ సురక్షితంగా ఉన్నారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >