| Daily భారత్
Logo




టీజీవో ఆధ్వర్యంలో ప్రజా సాంస్కృతిక పండగ బతుకమ్మ పోస్టర్ విడుదల

News

Posted on 2025-09-24 14:54:36

Share: Share


టీజీవో ఆధ్వర్యంలో ప్రజా సాంస్కృతిక  పండగ బతుకమ్మ పోస్టర్ విడుదల

డైలీ బారత్ న్యూస్, నిజామాబాద్: రాష్ట్ర ప్రజాసాంస్కృతిక పండుగ బతుకమ్మ ఉత్సవాల సందర్బంగా బతుకమ్మ పోస్టర్ విడుదల కార్యక్రమం ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమం నిజామాబాద్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు. పోస్టర్‌ను మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ అనురాధ, తెలంగాణ గెజెటెడ్ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సంగం అమృత్ కుమార్, టీజిఓ మహిళా విభాగం చైర్ పర్సన్ జయంతి కుమారి సంయుక్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయ, సాంస్కృతిక విశిష్టతను ప్రతిబింబిస్తుందని, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు. విద్యార్థినులు ఈ పండుగను సాంస్కృతిక ఉత్సవంగా భావించి ఉత్సాహంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీజీవో పదాధికారులు దేవిసింగ్, పవనీ, నాగరాజు, చంద్ర, విజ్నేష్, సరస్వతి, విజయత, శ్రీతిల, సుజాత పాల్గొన్నారు. అలాగే పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >