| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రైలు పట్టాలపై గొడవ: రైలు ఢీకొని ఇద్దరు మృతి

రైలు పట్టాలపై గొడవ: రైలు ఢీకొని  ఇద్దరు మృతి

డైలీ భారత్, హైదరాబాద్ : వారిద్దరూ ఫ్రెండ్స్. మద్యం తాగడం, గంజాయి  పీల్చడం వారి హాబీ.. తరచూ గొడవలు పడుతుంటారు..

ఈ క్రమంలోనే నిన్న సాయం  త్రం వారి మధ్య మళ్లీ వివా దం మొదలైంది.. దీంతో రైలు పట్టాలపైకి వెళ్లారు.. అక్కడ ఘర్షణ పడ్డారు.. ఇదే క్రమంలో రైలు దూసు కొచ్చింది.. దీంతో ట్రైన్ ఢికొని.. వారిద్దరూ అక్కడే దుర్మరణం చెందారు.

ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ పాతబస్తీ భవానీనగర్‌లో కలకలం రేపింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. రైలు పట్టాలపై కొంతమంది గొడవ పడుతున్న సమయం లో ఒక్కసారిగా రైలు వచ్చి ఢీకొడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటన తర్వాత మరి కొంతమంది అక్కడ నుంచి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు.స్థానికుల నుంచి సమాచారం అందుకున్న భవాని నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి.. వివరాలు సేకరించారు.

రైల్వే పోలీసులు కూడా అక్కడికి చేరుకుని మృత దేహాలను మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

Previous బస్సులో ఘోరంగా కొట్టుకున్న మహిళలు
Next విద్యార్థి దశ నుండే ట్రాఫిక్ నియమాలు,సిగ్నల్స్ మీద అవగాహన ఉండాలి.ట్రాఫిక్ ఆర్.ఎస్ రాజు.
ADVERTISEMENT