Posted on 2023-12-29 13:44:38
సిరిసిల్ల జర్నలిస్టులకు ఆరు మాసాల్లో ఇండ్ల పట్టాలు నిర్మాణాలు
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పాటుపడుతామని, పట్టాలు రాని జర్నలిస్టులకు పట్టాలు ఇప్పించడంతోపాటు జర్నలిస్టులు అందరికీ ఇండ్ల నిర్మాణానికి ఆరు మాసాలలోపు పరిష్కరించడం జరుగుతుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి లను ప్రెస్ క్లబ్ పాలకవర్గం, సభ్యులు శాలువాతో సత్కరించారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని అధికారంలోకి రాకముందే హామీ ఇచ్చామని గుర్తుచేశారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీ ప్రకారం ఇంటి స్థలాలతో పాటు ఇండ్లను కూడా ప్రభుత్వం నిర్మించి ఇస్తుందని హామీ ఇచ్చారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉండి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆకుల జయంత్, ప్రధాన కార్యదర్శి పరకాల ప్రవీణ్ కుమార్, రఘు రాపెళ్లి భాస్కర్ కాయితి మహేందర్ సీనియర్ జర్నలిస్టులు కరుణాల భద్రాచలం, తడుక విశ్వనాథం టివి నారాయణ, రాపెళ్లి సంతోష్ కుమార్, ఊరడి మల్లికార్జున్ రాచ లక్ష్మణ్ మిట్టపల్లి కాశీనాథ్ కాంబోజి ముత్యం మేడి కిషన్ ప్రెస్ క్లబ్ పాలకవర్గం సభ్యులు అల్లే రమేష్ నాయిని బాబు రాజా రమేష్ ఆన్సర్ అలీ దయానంద్ శిరీష నాలుగు పాల్గొన్నారు.
రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం
Posted On 2026-08-15 18:03:53
Readmore >
16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust
Posted On 2026-08-15 17:50:48
Readmore >
గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు
Posted On 2026-08-15 17:49:14
Readmore >
విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు
Posted On 2026-08-15 16:55:47
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 13:43:20
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >