| Daily భారత్
Logo




సంగారెడ్డి జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఇన్సినిరేషన్..

News

Posted on 2025-09-21 09:53:25

Share: Share


సంగారెడ్డి జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఇన్సినిరేషన్..

ఎండు గంజయి,ఆల్ప్రా జోలం, యం.డి.యం.ఎ  చట్టప్రకారమే దహనం,  జిల్లా ఎస్పీ పరితోష్  పంకజ్

583-కిలోల ఎండు గంజాయి, 1.777 కిలోల ఆల్ప్రాజోలం, 980 గ్రాముల యం.డి.యం.ఎ ను  ఇన్సినిరేషన్ పక్రియ ద్వారా దహనం,

సంగారెడ్డి జిల్లా: డైలీ భారత్ న్యూస్:సంగారెడ్డి జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో యన్.డి.పి.యస్. చట్ట ప్రకారం నమోదైన 20 కేసులలో సీజ్ చేయబడిన ప్రభుత్వ నిషేధిత 583-కిలోల ఎండు గంజాయి, 1.777 కిలోల ఆల్ప్రాజోలం, 980 గ్రాముల యం.డి.యం.ఎ ను చట్ట ప్రకారం కోర్టు అనుమతి తీసుకుని, జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో  శనివారం రోజు నాడు సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామిక వాడలలోని మెడీకేర్ పరిశ్రమలో ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ దహనం చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్  తెలియజేశారు. 

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ..  యన్.డి.పి.యస్. యాక్ట్ లోని నియమనిబంధనల ప్రకారం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉన్న ప్రభుత్వ నిషేదిత ఎండు గంజాయి, ఆల్ప్రాజోలం, యం.డి.యం.ఎ ను  దహనం చేయడం జరిగిందని అయన అన్నారు.

కొందరు అక్రమార్జనలో భాగంగా అక్రమ ఆల్ప్రాజోలం తయారీ, గంజాయి సాగు, విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి లాగుతున్నారని అన్నారు. జిల్లాలో అసాంఘీక, చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలను అరికట్టడానికి జిల్లాలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం లను ఏర్పాటు చేయడం జరిగిందని,  ఈ టిమ్స్ జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ దాడులు చేపట్టడం జరిగిందని, జిల్లాలో ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలను విక్రయించి, సరఫరా చేసినా, లేదా సాగు చేసిన కఠిన చర్యలు తప్పవని  జిల్లా ఎస్పీ  హెచ్చరించారు. 

ఈ డ్రగ్ డిస్పోజల్ కార్యక్రమంలో ఎస్పీ  వెంబడి సంగారెడ్డి డిఎస్పీ సత్యయ్యగౌడ్, పటాన్ చెర్వు డిఎస్పీ ప్రభాకర్, వర్టికల్ డిఎస్పీ సురేందర్ రెడ్డి, మెడికేర్ ఎన్విరాన్‌మెంటల్ పరిశ్రమ మేనేజర్ శివారెడ్డి,  డీసిఆర్బీ ఇన్స్పెక్టర్ బి.రమేష్, ఎస్-న్యాబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావ్, పటాన్ చెర్వు ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి, భానూర్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, సంబంధిత ఎస్.హెచ్.ఓ. లు పాలుగోన్నారు.

Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు

Posted On 2025-12-07 19:45:50

Readmore >
Image 1

చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి

Posted On 2025-12-07 18:39:01

Readmore >
Image 1

ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్

Posted On 2025-12-07 18:35:52

Readmore >
Image 1

ఆయా దినపత్రికల స్టాపర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

Posted On 2025-12-07 17:31:39

Readmore >
Image 1

పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

Posted On 2025-12-07 17:30:34

Readmore >
Image 1

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు

Posted On 2025-12-07 14:24:59

Readmore >
Image 1

పర్యాటక రాష్ట్రం గోవాలో భారీ అగ్నిప్రమాదం

Posted On 2025-12-07 08:40:10

Readmore >
Image 1

టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

Posted On 2025-12-06 17:39:53

Readmore >
Image 1

హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య

Posted On 2025-12-06 16:17:59

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు

Posted On 2025-12-06 16:16:40

Readmore >