Posted on 2025-09-18 11:12:38
అరుదైన రోబోటిక్ చికిత్స ద్వారా 200 ఆపరేషన్లు పూర్తి చేసిన వైద్యులు
ఆనందోత్సవాల్లో పాల్గొన్న చికిత్స పొందిన బాధితులు..
ఇంతటి విజయానికి కారణమైన వైద్యులకు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు
నోవా లైఫ్ హాస్పిటల్ వైద్యులు నవీన్ మాలు దీప..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నోవా లైఫ్ ఆసుపత్రిలో 200 ఆపరేషన్లు విజయవంతంగా అయినందువల్ల చికిత్స పొందిన బాధితులతో గెట్ టు గెదర్ కార్యక్రమాన్ని గురువారం ఆస్పత్రిలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యులు నవీన్ మాలు దీపమాలు మాట్లాడుతూ..... నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా రోబోటిక్ నూతన టెక్నాలజీ తో 200 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.. కీళ్ల మార్పిడి, జనరల్ శాస్త్ర చికిత్సలు జనరల్ చికిత్స విభాగము, శ్రీ వైద్య నిపుణులు, నెఫ్రాలజీ విభాగంలో అత్యంత సేవలు అందించడంలో వైద్యుల పాత్ర చాలా గొప్పదని అన్నారు. గెట్ టుగెదర్ పెట్టగానే బాధితులు రావడం.. ఆటపాటలతో అందర్నీ అలరించడం ఎంతో సంతోషాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు. వారితోపాటు డాన్సులు వేయడం నాకు ఎంతో బాధ్యతను గుర్తుచేసినట్లు అనిపించిందని అన్నారు... ఇంతటి ఆనందానికి కారణం ఆసుపత్రి లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు.. నిజామాబాద్ ప్రజలు హైదరాబాద్ వరకు వెళ్లకుండా మన దగ్గరనే నిజామాబాద్ లో నోవా ఆసుపత్రిలోనే అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్ చేయడం జరుగుతుందని అన్నారు.... నిరుపేద ప్రజలను గుర్తుపెట్టుకొని వారి బడ్జెట్ తగ్గట్టుగా వారికి అండగా నిలబడడమే నోవా ఆసుపత్రి లక్ష్యమని అన్నారు. హైదరాబాద్ కంటే నోవా ఆస్పత్రిలోనే అత్యుత్తమ నూతన టెక్నాలజీతో ఆపరేషన్లు చేస్తున్నారని బాధితులు చెప్పడం ఎంతో సంతోషం గా ఉందన్నారు.
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >