Posted on 2025-09-18 07:55:26
ప్రజలు తమ సమస్యలు తెలపడానికి ఎక్కడికి వెళ్లాలనే అయోమయంలో జిల్లా ప్రజలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ పిసిసి అధ్యక్షుడు, నిజామాబాద్ ఎమ్మెల్సీ, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్యాంప్ ఆఫీస్ అంటూ నిజామాబాద్ లో ఒకటి ఉందా అంటూ అటు ప్రజలు, అధికారులు తలలు బాదుకుంటున్నారు. పిసిసి పదవి వరించి ఏడాది కాలం గడిచినప్పటికీ ఇంకా జిల్లాలో ఆయనకంటూ ఒక ప్రత్యేకంగా ఒక క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకోకపోవడం తో జిల్లా ప్రజలు, తమ సమస్యలు విన్నవించడానికి ఎవరితో చెప్పుకోవాలో తెలియక అయోమయ పరిస్థితిలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అప్పుడప్పుడు జిల్లా వాసిగా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు పిసిసి అధ్యక్షుడిని ఎక్కడ కలవాలో తమ సమస్యను వినతి పత్రాలను ఎవరికి ఎక్కడ అందించాలో తెలియక జిల్లా ప్రజలు అయోమయంలో ఉన్నారు. మరోవైపు ఆయన జిల్లాకు పర్యటన కోసం వస్తే అధికారులు ఎక్కడ ఆయన కోసం ఏర్పాటు చేయాలో ఆయనకంటూ ఒక క్యాంప్ ఆఫీస్ లేక అధికారులు సైతం గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పటికైనా పిపిసిసి అధ్యక్షుడికి ఓ ప్రత్యేక క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తే ప్రజలకు వారి సమస్యలకు తెలుక్కోడానికి వెలుగా ఉంటుందని జిల్లా ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >