| Daily భారత్
Logo




భారీ వర్షాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి లో నిర్వహించనున్న కృతజ్ఞత సభ వాయిదా

News

Posted on 2025-09-12 12:12:20

Share: Share


భారీ వర్షాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి లో నిర్వహించనున్న కృతజ్ఞత సభ వాయిదా

రానున్న నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి లో నిర్వహించనున్న కృతజ్ఞత సభ వాయిదా..

ఇటీవల కామారెడ్డిలో ఏర్పడ్డ వరద ప్రభావం వల్ల కోలుకోని ప్రజల మధ్య సభ నిర్వహించడం మంచిది కాదంటూ కాంగ్రెస్లోని మరికొందరు సీనియర్ నేతల భిన్నాభిప్రాయాలు...

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కాంగ్రెస్ పార్టీ ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వ‌హించ త‌ల‌పెట్టిన బీసీ కృత‌జ్ఞ‌త స‌భ వాయిదా ప‌డింది. భారీ వర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో స‌భ‌ను వాయిదా వేయాల‌ని అధికార పార్టీ నిర్ణ‌యించింది. 42 శాతం బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిల‌బెట్టుకున్న త‌రుణంలో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ పార్టీ త‌ల‌చింది. ఎక్కడైతే బీసీ డిక్ల‌రేష‌న్ స‌భ  నిర్వ‌హించారో అక్క‌డే కృత‌జ్ఞ‌త స‌భ నిర్వ‌హించాల‌ని నిర్ణయించింది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో బీసీ డిక్ల‌రేష‌న్​ను విడుద‌ల చేసింది. అప్ప‌ట్లో పార్టీ అగ్ర నేతల‌తో పాటు క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య‌ను ఆహ్వానించింది. రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన హ‌స్తం పార్టీ.. బీసీల‌కు ఇచ్చిన హామీ మేర‌కు 42 శాతం అమ‌లు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపంచింది. అది ప్ర‌స్తుతం రాష్ట్ర‌ప‌తి వ‌ద్ద పెండింగ్‌లో ఉంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో రిజ‌ర్వేష‌న్ల‌పై పరిమితి ఎత్తివేస్తూ, బీసీల‌కు 42 శాతం కోటా పెంచుతూ జీవో జారీ  చేసింది. అయితే ఇప్ప‌టికే ముఖ్యమంత్రి కృతజ్ఞత సభకు ఏర్పాట్లు కూడా ప్రారంభ‌మ‌య్యాయి. ప‌లువురు మంత్రులు కూడాఎప్ప‌టిక‌ప్పుడు ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. అయితే, స‌భ‌కు గ‌డువు స‌మీపిస్తున్న త‌రుణంలో వాతావ‌రణం ప్ర‌తికూలంగా మారింది. మ‌రో నాలుగైదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ స‌భ‌ను వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించింది. మ‌ళ్లీ ఎప్పుడు నిర్వ‌హించేది త్వ‌ర‌లోనే ఆ పార్టీ శ్రేణుల నుండి వినికిడి వినిపిస్తుంది.

Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >
Image 1

ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా

Posted On 2026-08-28 14:18:02

Readmore >
Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >
Image 1

చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన!

Posted On 2026-08-28 08:06:13

Readmore >
Image 1

ఒక ప్రత్యేకమైన వాగ్దానం కారణంగా కట్టబడిన తొలి రాఖీ

Posted On 2026-08-28 07:11:25

Readmore >
Image 1

రాఖీ పండుగ

Posted On 2026-08-28 02:56:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

Posted On 2026-08-27 19:02:09

Readmore >