| Daily భారత్
Logo




శాంతిభద్రతలను కాపాడటమే పోలీసుల విధి..

News

Posted on 2025-09-12 14:20:08

Share: Share


శాంతిభద్రతలను కాపాడటమే పోలీసుల విధి..

పోలీస్ శాఖను కించపరిచేలా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: సమాజంలో ఉన్న శాంతి భద్రతలను కాపాడడమే పోలీస్ శాఖ యొక్క ముఖ్య విధులు అని పోలీస్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు షకీల్ పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాద్ సీపీ కార్యాలయంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఆర్మూర్ లో గణేష్ నిమజ్జన సమయంలో పోలీస్ శాఖపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచితంగా మాట్లాడడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన అన్నారు. శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వార్తాపత్రికల్లో, సోషల్ మీడియాలో పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడ జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి గత నెల 14న రాత్రి 7:30 నిమిషాలకు ఆర్మూర్ పట్టణంలోని యాసీన్ హోటల్ వద్ద ఫేస్బుక్ లైట్ ద్వారా స్థానిక ఎస్హెచ్ఓ ను హోటల్ ఎందుకు బంద్ చేస్తున్నారని, పింకు బుక్కు యందు మీ పేరు ఎక్కిస్తానని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తానని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సదరు ఎస్హెచ్ఓ కు బెదిరించడం జరిగిందని ఆయన తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా రాత్రి సుమారు 10 గంటల సమయంలో అన్ని ఎస్టాబ్లిష్మెంట్ లు బంద్ పనిచేస్తున్నామని అందులో భాగంగానే హోటల్ బంద్ చేయడం జరిగిందని పోలీసులు చట్టపరంగా ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని ఎస్టాబ్లిష్మెంట్లను బంద్ చేయడం జరుగుతుందన్నారు. అంతేకానీ దీనిపై ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా తమ విధులను నీరు కార్చే విధంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకు వినాయక విగ్రహ చవితి ప్రతిష్టాపన నుండి నిమజ్జనం వరకు పోలీసులు విధి నిర్వహణలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎలాంటి చిన్న సంఘటనలు జరగకుండా రాత్రింబవళ్లు చూసుకోవడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం డీజే, ఐ వాల్యూమ్ స్పీకర్లు నిషేధించడం జరిగిందని, తమ ఆంక్షలు అతిక్రమించి ఇష్టానుసారంగా వ్యవహరించడం పట్లనే అక్కడ ఉన్న సంబంధిత వ్యక్తిపై కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. అది కూడా విధి నిర్వహణలో భాగంగానే కానీ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పోలీసులను టార్గెట్ చేస్తూ మా వారిపై తప్పుడు కేసులు పెట్టడం జరిగిందని ప్రచారం చేస్తున్నారు దీనివల్ల మా పోలీసుల మనోధైర్యం దెబ్బతిసే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని, రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా పనిచేసిన జీవన్ రెడ్డి పోలీసులపై కనీస మర్యాద లేకుండా తమ మనో ధైర్యాన్ని దెబ్బతీసే విధంగా చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని పోలీస్ సంఘం తరఫున ఆయనకు విన్నవించడం జరుగుతుందన్నారు. ఒకవేళ మళ్లీ ఇదేవిధంగా వ్యాఖ్యలు చేస్తే పోలీస్ సంఘం తరఫున చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ ఎగ్జిక్యూటివ్ నెసమావేశంలో తెలంగాణ స్టేట్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ జిల్లా హోనారి  ప్రెసిడెంట్ రాజన్న, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గోవర్ధన్ రెడ్డి, చందులాల్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >
Image 1

ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా

Posted On 2026-08-28 14:18:02

Readmore >
Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >
Image 1

చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన!

Posted On 2026-08-28 08:06:13

Readmore >
Image 1

ఒక ప్రత్యేకమైన వాగ్దానం కారణంగా కట్టబడిన తొలి రాఖీ

Posted On 2026-08-28 07:11:25

Readmore >