| Daily భారత్
Logo




ఫ్లెక్సీలు డిజైన్ చేసే వారికి, ప్రజలకు, ప్రింటింగ్ ప్రెస్ వారికి హెచ్చరిక

News

Posted on 2025-09-11 17:42:04

Share: Share


ఫ్లెక్సీలు డిజైన్ చేసే వారికి, ప్రజలకు, ప్రింటింగ్ ప్రెస్ వారికి హెచ్చరిక

ఫ్లెక్సీలు మరియు ప్లకార్డుల రూపంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు, అనుచిత పదజాలంపై కఠిన చర్యలు 

ఫ్లెక్సీలు డిజైన్ చేసే వారికి, ప్రజలకు, ప్రింటింగ్ ప్రెస్ వారికి హెచ్చరిక

ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్, ఐపీయస్.

డైలీ భారత్, ప్రకాశం జిల్లా: ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లాలో ఫ్లెక్సీ పోస్టర్స్ మరియు ప్లకార్డుల రూపంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, సమాజంలో వర్గాల మధ్య విద్వేషాలను రేకెత్తించే విధమైన భాష ప్రయోగం, అసభ్యకర వ్యాఖ్యలు కనిపించడం నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ పలు సూచనలు తెలియజేసింది. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు, మతసామరస్యాన్ని కాపాడటానికి ఈ విధమైన ప్రవర్తనను నేరంగా పరిగణిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో, ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ కిందివిధంగా ఫ్లెక్సీ డిజైన్/ప్రింటింగ్ సంస్థలకు మరియు ప్రజలకు పలు సూచనలు తెలియజేశారు.

ప్లెక్సీలలో  కుల,మత, సామాజిక వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా ఎటువంటి విషయాలు ఉండరాదు. ఫ్లెక్సీ పోస్టర్లలో ఎటువంటి వర్గ విద్వేషాలను ప్రోత్సహించే పదాలు, వ్యాఖ్యలు ఉండరాదు. వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం, ఇతరుల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు  ఫ్లెక్సీలలో వాడితే అది నేరంగా పరిగణించబడుతుంది. అలాంటి  ఫ్లెక్సీలకు బాధ్యత వహించిన వ్యక్తిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

విచక్షణ లేకుండా ఎటువంటి ఫ్లెక్సీ అయినా ముద్రించడం ద్వారా, ప్రజా శాంతి భద్రతలకు, వివాదాస్పద విషయాలకు మద్దతుగా నిలబడే డిజైనర్లు, ప్రింటింగ్ సంస్థలు కూడా చట్టపరంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. వారు నేరంతో సహకరించిన వారిగా పరిగణించబడి, సంబంధిత చట్ట సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వారి దుకాణాలను సీజ్ చేయడం జరుగుతుంది.

జిల్లాలో శాంతియుత వాతావరణాన్ని భంగం చేయాలనే ఉద్దేశంతో  ఫ్లెక్సీలు రూపొందించి, మత విశ్వాసాలను కించపరిచేలా ఉండే పదజాలం వినియోగించడం లేదా రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలకు మార్గం వేయడం సరైనది కాదు.  ఇలా ప్రవర్తించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

ఫ్లెక్సీ రూపకల్పన చేసే ప్రతి డిజైనర్, ముద్రణ సంస్థ తమ బాధ్యతను గుర్తుంచుకోవాలి. కస్టమర్ అడిగినదాన్ని ప్రింట్ చేయకూడదు. ప్రతి పదం, ప్రతి వాక్యం పర్యవసానాలను కలిగి ఉంటుంది. సామాజిక చైతన్యం కలిగి ఉండే అంశాలను మాత్రమే ప్రచారం చేయాలి కానీ, ఇతరులను ఉద్దేశపూర్వకంగా నిందించే విధంగా ఉండకూడదు.

అలాగే, యువత, రాజకీయ కార్యకర్తలు, సంఘ సంస్థలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. తమ అభిప్రాయాలను వ్యక్తీకరించేటప్పుడు శాంతియుత మార్గాలు ఎంచుకోవాలి. ఇదే సమయంలో సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ఫ్లెక్సీలను షేర్ చేయడం, వాటిని ప్రోత్సహించడం వంటి చర్యలు కూడా నేరాలలోకి వస్తాయని గుర్తించాలి. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించాలి.

శాంతియుత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరి సహకారం అత్యవసరం. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవు.

Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >
Image 1

చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన!

Posted On 2026-08-28 08:06:13

Readmore >
Image 1

ఒక ప్రత్యేకమైన వాగ్దానం కారణంగా కట్టబడిన తొలి రాఖీ

Posted On 2026-08-28 07:11:25

Readmore >
Image 1

రాఖీ పండుగ

Posted On 2026-08-28 02:56:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

Posted On 2026-08-27 19:02:09

Readmore >
Image 1

మణుగూరు స్టోర్ గ్రౌండ్‌లో ఘర్షణ.. యువకుడి మృతి

Posted On 2026-08-27 19:00:55

Readmore >
Image 1

అంతంపల్లి PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-27 17:17:45

Readmore >
Image 1

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి

Posted On 2026-08-27 17:15:17

Readmore >
Image 1

సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా

Posted On 2026-08-27 16:57:22

Readmore >
Image 1

హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన

Posted On 2026-08-27 16:49:27

Readmore >