| Daily భారత్
Logo




ద్వారకామయి పిల్లల ఆసుపత్రిలో దారుణం..

News

Posted on 2025-09-11 18:16:31

Share: Share


ద్వారకామయి పిల్లల ఆసుపత్రిలో దారుణం..

ఆడ పిల్లలను జన్మనిచ్చిన తల్లి.. ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం

పాప ప్రాణం ఖరీదు కంటే.. పైసే ముఖ్యమంటున్న ప్రవేట్ ఆసుపత్రుల వైద్యులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్ బాడీ ప్రాంతంలో గల ద్వారకామాయి పిల్లల ఆసుపత్రిలో గురువారం దారుణం చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా సొన్ మండలంలోని పాకుపట్ల గ్రామానికి చెందిన రజిత  పురిటి నొప్పులతో జిల్లా కేంద్రంలోని వైష్ణవి హాస్పిటల్లో ఏడు నెలల్లో నే ఇద్దరు ఆడపిల్లలను జన్మనిచ్చింది. ఏడు నెలలకే కవల పిల్లలు పుట్టడంతో వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ద్వారకామై పిల్లల ఆసుపత్రికి పిల్లలను చికిత్స నిమిత్తం తరలించారు. నెల రోజుల చికిత్స అనంతరం వారిలో ఓ పాప గత సోమవారం మృతి చెందింది. అయితే మృతి చెందిన పాపకు వైద్యం అందించామని అందుకు సుమారు 5 లక్షల వరకు ఆస్పత్రి వైద్యులు వసూలు చేసినట్లు పాప తల్లి,కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే కవల పిల్లలు మరో ఆడపిల్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించాలని వైద్యులు సూచించడంతో పాప బంధువులు తల్లి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అప్పటికే అప్పులు చేసి బిల్లులు చెల్లించామని తమ వద్ద ఒక్క రూపాయి లేదని ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో మెరుగైన వైద్య చికిత్స కోసం ఎలా తీసుకెళ్తామని వారు వాపోయారు. బ్రతికి ఉన్న మరో పాపను ఆసుపత్రి నుండి డిశ్చార్జి చేయాలంటే మరో మూడు లక్షల ఆసుపత్రి బిల్లు చెల్లించాలని ద్వారకమై ఆసుపత్రి వైద్యులు సూచించడంతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం కొందరు మధ్యవర్తులు ఇరువురితో చర్చలు జరిపి డబ్బులు కట్టకుండా పాపను మరో ఆసుపత్రికి తరలించేందుకు ఆస్పత్రి వైద్యులను ఒప్పించారు.


Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >
Image 1

చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన!

Posted On 2026-08-28 08:06:13

Readmore >
Image 1

ఒక ప్రత్యేకమైన వాగ్దానం కారణంగా కట్టబడిన తొలి రాఖీ

Posted On 2026-08-28 07:11:25

Readmore >
Image 1

రాఖీ పండుగ

Posted On 2026-08-28 02:56:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

Posted On 2026-08-27 19:02:09

Readmore >
Image 1

మణుగూరు స్టోర్ గ్రౌండ్‌లో ఘర్షణ.. యువకుడి మృతి

Posted On 2026-08-27 19:00:55

Readmore >
Image 1

అంతంపల్లి PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-27 17:17:45

Readmore >
Image 1

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి

Posted On 2026-08-27 17:15:17

Readmore >
Image 1

సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా

Posted On 2026-08-27 16:57:22

Readmore >
Image 1

హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన

Posted On 2026-08-27 16:49:27

Readmore >