Posted on 2025-09-09 13:48:50
లక్ష రూపాయల చెక్కును అందజేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థిని తల్లిదండ్రులు
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: పేద విద్యార్థిని చదువుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది, చదువు మధ్యలో ఆగిపోకుండా కళాశాలలో చెల్లించాల్సిన ఫీజు కోసం ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
తంగళ్ళపల్లి మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన ఇమ్మడోజు ఆశ్రిత హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు కళాశాలలో బీటెక్ మూడవ తరగతి చదువుతుంది. కళాశాలలో ఫీజు చెల్లించేందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, ఆర్థిక సహాయం చేయాలని హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు సమర్పించింది. స్పందించిన ప్రభుత్వం తగిన సహాయం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు సూచించారు.
మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆశ్రిత తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఉన్నత విద్య అభ్యసించి, లక్ష్యం చేరుకోవాలని ఆకాంక్షించారు. తమ కూతురు చదువుకు ఆర్థిక సహాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వం, సహకరించిన జిల్లా కలెక్టర్ కు ఆశ్రిత తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి
Posted On 2026-08-27 17:15:17
Readmore >
సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా
Posted On 2026-08-27 16:57:22
Readmore >
హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన
Posted On 2026-08-27 16:49:27
Readmore >