Posted on 2025-09-08 17:55:50
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు భాజపా సీనియర్ నాయకుడు బసవ లక్ష్మీ నరసయ్య కు ఆ పార్టీ అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇకపై భజప్ప రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీ నరసయ్య కొనసాగుతారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇన్నాళ్లు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న బస్వ లక్ష్మీ నరసయ్య ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా పర్యటనలో భాగంగా అప్పటినుండి చురుకుగా పాల్గొంటున్న నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో నామమాత్రపు అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్లు అతని సన్నిహితులు చర్చించుకుంటున్నారు. ఎప్పటినుండో పార్టీ కోసం పార్టీ అధికారం కోసం తనవంతుగా కృషిచేసిన బసవ లక్ష్మీనరసయ్య గత కొంతకాలంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆయనకు కొన్ని విభేదాలు తలెత్తినట్లు ప్రచారం కొనసాగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకు రాష్ట్రస్థాయిలో ఏ ప్రాధాన్యం లేని రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం పట్ల ఆయన వర్గీయులు ఒకింత నిరాశకు గురవయ్యారు. అలాగే బిజెపిలో చేరిన కొన్ని రోజుల్లోనే బిజెపి మహిళ నేతకు రాష్ట్రస్థాయిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పజెప్పడం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త చర్చకు దారితీసింది.
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >