Posted on 2025-09-04 15:49:15
అసంపూర్తి పనులు పూర్తి చేయాలి
డ్రైనేజ్, నీటి సమస్య పరిష్కరించాలి
ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్, రాగట్లపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
డైలీ భారత్, ఎల్లారెడ్డిపేట:ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న గదుల నిర్మాణాలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్, రాగట్లపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న తీరు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు.
మధ్యాహ్న భోజనం తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ మీద తయారుచేయాలని నిర్వాహకులకు సూచించారు. డ్రైనేజీ, నీటి సమస్యలకు పరిష్కారం చూపాలని గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. రాగట్లపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల హాజరు నమోదు రిజిస్టర్ల పరిశీలించారు. విద్యాలయానికి ప్రహరీ నిర్మించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో నిత్యం అన్ని పాఠ్యాంశాలు చదివించాలని, రాయించాలని, అభ్యాసన సామర్ధ్యాల ఆధారంగా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >